తెలంగాణ

telangana

ETV Bharat / sports

లాక్​డౌన్​ను అలా ఉపయోగించుకున్న మాజీ వికెట్ కీపర్

భారత మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా.. లాక్​డౌన్​ వేళ ఆస్ట్రేలియా కోచింగ్ కోర్సు పూర్తి చేశారు. అయితే బీసీసీఐ మూడో లెవల్ కోచింగ్​కు అర్హత సాధించడమే తన లక్ష్యమని చెప్పారు.

లాక్​డౌన్​ను అలా ఉపయోగించుకున్న మాజీ వికెట్ కీపర్
మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా

By

Published : Apr 19, 2020, 6:50 PM IST

Updated : Apr 19, 2020, 6:58 PM IST

టీమిండియా మాజీ వికెట్​ కీపర్ అజయ్ రాత్రా.. లాక్​డౌన్ సమయాన్ని పూర్తి సద్వియోగం చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ నిర్వహిస్తున్న కోచింగ్ కోర్సును పూర్తి చేశారు. ఈ మేరకు తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

"ఏప్రిల్ 6వ తేదీన పూర్తి చేసిన కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్ అందుకున్నా. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నతస్థాయి కోర్సులకు అర్హత లభించింది. కానీ బీసీసీఐ మూడో లెవల్ కోచింగ్​కు అర్హత సాధించడమే నా లక్ష్యం. క్రికెట్ గురించి మనం ఎంత తెలుసుకున్న ఇంకా నేర్చుకోవచ్చు. బీసీసీఐ ఎంతో బలమైన సంస్థ అందుకే గొప్ప గొప్ప క్రికెటర్లను అందించింది" -అజయ్ రాత్రా, భారత మాజీ వికెట్ కీపర్

గతంలో భారత మహిళా క్రికెట్​ జట్టుకు కోచ్​గా పనిచేసిన అజయ్.. గతేడాది రంజీ సీజన్​లో అసోం టీమ్​కు కోచ్​గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికే బీసీసీఐ నుంచి లెవల్ 2 కోచ్​గానూ గుర్తింపు తెచ్చుకున్నారు.

Last Updated : Apr 19, 2020, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details