వచ్చే ఏడాది ఇంగ్లాండ్తో జరగనున్న డే అండ్ నైట్(గులాబీ బంతి) టెస్టు మ్యాచ్కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తుందని తెలిపాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. అయితే దీనిపై మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టులు, పరిమిత ఓవర్ల సిరీస్ జరగనుంది.
షెడ్యూల్ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ టీమ్ఇండియా ఆడాలి. కరోనా వల్ల వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిని జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఒకవేళ అప్పటికీ వైరస్ ఉద్ధృతి తగ్గకపోతే ఈ సిరీస్ను యూఈఏకి తరలించాలని బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పుకార్లకు చెక్ పెడుతూ గంగూలీ.. ఇక్కడే ఉంటుందని స్పష్టం చేశాడు.