తెలంగాణ

telangana

ETV Bharat / sports

వివాదాస్పద డీఆర్​ఎస్​పై ఇంగ్లాండ్ అసహనం

భారత్​తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజున ఇంగ్లాండ్​కు చేదు అనుభవం ఎదురైంది. జాక్​ లీచ్​ బౌలింగ్​లో రహానె గ్లోవ్స్​కు బంతి తాకుతూ వెళ్లినా.. అంపైర్లు ఔట్​ ఇవ్వకపోవడం పట్ల నిరాశ చెందారు. ఎట్టకేలకు అంపైర్ తప్పిదం వెలుగుచూడటం వల్ల కోల్పోయిన రివ్యూను తిరిగి పొందారు.

After third umpire's goof-up, 'review' restored to England
ఆ నిర్ణయంతో ఇంగ్లాండ్​ అసహనం.. దక్కిన రివ్యూ

By

Published : Feb 14, 2021, 5:31 AM IST

టీమ్​ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో కోల్పోయిన ఓ రివ్యూను ఇంగ్లాండ్ తిరిగి పొందింది. థర్డ్​ అంపైర్ తప్పిదం కారణంగా పర్యటక జట్టు సమీక్షను కోల్పోవాల్సి వచ్చింది. అయితే కాసేపటికే తప్పిదాన్ని గుర్తించిన అంపైర్లు ఇంగ్లాండ్​కు రివ్యూను తిరిగిచ్చారు.

ఏం జరిగిందంటే..

తొలి రోజు భారత్​ మొదటి ఇన్నింగ్స్​లో 75వ ఓవర్​లో రహానెకు బౌలింగ్​ చేస్తున్నాడు జాక్ లీచ్. ఆ సమయంలో భారత్ 248/4, రహానె 66 పరుగుల వద్ద ఉన్నాడు. బంతి గ్లోవ్స్​కు తాకి షార్ట్​లెగ్ ఫీల్డర్ ఓలీ పోప్ చేతిలో పడింది. ఔట్​ కోసం ఇంగ్లాండ్​ అప్పీలు చేయగా అంపైర్​ నాటౌట్​గా ప్రకటించారు.

రూట్

దీంతో ఇంగ్లాండ్ రివ్యూ కోరింది. బంతి లెగ్​ స్టంప్​ అవతల నుంచి వెళ్లినందున ఎల్​బీడబ్ల్యూ కాదని థర్డ్​ అంపైర్ సునీల్ చౌదరీ నాటౌట్​గా ప్రకటించారు. బంతి గ్లోవ్స్​కు తాకినా ఔట్ ఇవ్వకపోయేసరికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు అసహనానికి గురయ్యారు.

కాసేపటికి పూర్తి రిప్లే చూసిన తర్వాత అంపైర్ తప్పిదం బయటపడింది. దీంతో ఇంగ్లాండ్​ జట్టుకు కోల్పోయిన సమీక్ష దక్కింది. అయితే రివ్యూ కోల్పోవడం వల్ల రహానెకు మరో అవకాశం దక్కినా.. ఆ తర్వాత ఓవర్లోనే అతడు మరో పరుగు చేసి 67 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.

రహానె

ఇదీ చూడండి:చెన్నై టెస్టు: తొలి రోజు ఆట పూర్తి- టీమ్​ఇండియా 300/6

ABOUT THE AUTHOR

...view details