తెలంగాణ

telangana

ETV Bharat / sports

అఫ్గాన్​ క్రికెటర్ షెహజాద్​పై ఏడాది నిషేధం - acb

క్రమశిక్షణ నియమాలను ఉల్లంఘించిన కారణంగా అఫ్గాన్​ స్టార్ ప్లేయర్ మహ్మద్ షెహజాద్​పై ఏడాది పాటు వేటు వేసింది ఆ దేశ క్రికెట్ బోర్డు. అతడు ఏ ఫార్మాట్​లోనూ ఆడేందుకు వీలులేదని తెలిపింది.

షెహజాద్

By

Published : Aug 20, 2019, 7:02 AM IST

Updated : Sep 27, 2019, 2:53 PM IST

అఫ్గానిస్థాన్ క్రికెటర్ మహ్మద్​ షెహజాద్​పై ఆ దేశ క్రికెట్ బోర్డు సస్పెన్షన్ విధించింది. నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఏడాది పాటు వేటు వేసింది. అనుమతి లేకుండా విదేశాల్లో ఆడాడని, శిక్షణ తీసుకున్నాడని ఆరోపించింది. నిషేధిత కాలంలో షెహజాద్​ ఏ ఫార్మాట్​లోనూ పాల్గొనేందుకు వీలులేదని తెలిపింది.

"షెహజాద్.. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) క్రమశిక్షణా నియమాలను, నిబంధనలను ఉల్లంఘించాడు. అనుమతి లేకుండా వేరే దేశాల్లో ఆడాడు, శిక్షణ తీసుకున్నాడు. ఈ కారణంగా అతడిపై 12 నెలల సస్పెన్షన్ విధిస్తున్నాం" -ఏసీబీ ప్రకటన

క్రికెట్ సాధన, శిక్షణ కోసం ఏసీబీ వద్ద అన్ని సౌకర్యాలు ఉన్నాయని, వాటి కోసం విదేశాలకు వెళ్లడం నియమాలను ఉల్లంఘించడమేనని ప్రకటనలో తెలిపింది ఏసీబీ.

మోకాలి గాయం, ఫిట్​నెస్​ లేమితో ప్రపంచకప్​లో అతడి స్థానంలో వేరొకరికి అవకాశం కల్పించింది ఏసీబీ. కావాలనే తనను మెగాటోర్నీకి దూరంగా పెట్టారని షెహజాద్ ఆరోపించాడు. ఆ అంశం వివాదాస్పదమైంది.

ఇది చదవండి: అక్తర్​కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన యువీ

Last Updated : Sep 27, 2019, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details