ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్ నుంచి దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ సీజన్‌కు అందుబాటులో ఉండట్లేదని తెలిపాడు. ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు. అతడు బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజీ తరఫున ఆడాల్సి ఉంది.
లీగ్ నుంచి తప్పుకున్న డివిలియర్స్ - big bash league
ఈ సీజన్ బిగ్‌బాష్ లీగ్‌కు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డివిలియర్స్ అందుబాటులో ఉండట్లేదు. తనకు మూడో బిడ్డ పుట్టబోతుందని.. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితుల మధ్య ప్రయాణాలు సరికాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
డివిలియర్స్
"నా భార్య మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీనికి మేం ఎంతో సంతోషంగా ఉన్నాం. కరోనా ప్రయాణ ఆంక్షలు, ప్రస్తుత పరిస్థితుల వల్ల ఈ సీజన్‌కు ఆడకూడదని నిశ్చయించుకున్నా" అని డివిలియర్స్ అన్నాడు.