తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ 20 నిమిషాలపై ఫించ్​ అసహనం అందుకే..!

సిడ్నీ వేదికగా తొలి టీ20లో పాకిస్థాన్​తో తలపడింది ఆసీస్​. ఈ మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. అయితే రద్దు చేయడానికి ముందు రెండో ఇన్నింగ్స్​ ప్రారంభానికి 20 నిమిషాల పాటు విరామం ఇవ్వడంపై ఆసీస్​ సారథి ఆరోన్​ ఫించ్​ అసహనం వ్యక్తం చేశాడు.

ఫించ్

By

Published : Nov 4, 2019, 5:31 AM IST

ఆస్ట్రేలియా- పాకిస్థాన్​ మధ్య జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. అయితే ఇన్నింగ్స్​ల​ మధ్య 20 నిమిషాల పాటు విరామం ఉండటంపై అసహనం వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా సారథి​ ఆరోన్​ ఫించ్​.

20 నిమిషాల పాటు విరామం ప్రకటించక ముందే మ్యాచ్​ను 15 ఓవర్లకు కుదించారు రిఫరీలు. తొలి ఇన్నింగ్స్​ ముగిసిన 20 నిమిషాలకు బ్యాటింగ్​కు దిగింది ఆసీస్​.

"ఓవర్లలో కోత విధించి.. 20 నిమిషాల పాటు విరామం ఇచ్చారు. ఇదేమీ నాకు సరైనదిగా అనిపించడం లేదు. నిబంధనలు అలా ఉంటే మనం ఏమీ చెయ్యలేం."
-- ఆరోన్​ ఫించ్​, ఆస్ట్రేలియా సారథి

విరామ సమయం తగ్గించే అవకాశం మ్యాచ్​ రిఫరీ జవగల్​ శ్రీనాథ్​కు ఉంది. అయినా ఆ నిర్ణయం తీసుకోలేదు. మొదటి ఇన్నింగ్స్​ ముగించక ముందు సుదీర్ఘ విరామం ఏర్పడితే.. విరామ సమయం 20 నిమిషాల నుంచి 10 నిమిషాలకు కుదించే అధికారం రిఫరీకి ఉంటుంది.

వర్షం వల్ల ఆట ఆగిపోవడం పాకిస్థాన్​కు కలిసొచ్చింది. మ్యాచ్​ను రద్దు చేసే ముందు ఆసీస్​ బ్యాట్స్​మెన్​లు విజృంభించి ఆడారు. మ్యాచ్​ ఫలితం తేలాలంటే కనీసం 5 ఓవర్ల ఆట ఆడి.. 39 పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే మూడు ఓవర్లు ఆడేసిన ఆసీస్​ జట్టు.. 41 పరుగులు చేసింది. విరామాన్ని 10 నిమిషాలకు కుదించి ఉంటే.. ఆసీస్​ గెలిచేదే.
ఇదీ చదవండి: తొలి టీ20లో భారత్​పై బంగ్లా విజయం

ABOUT THE AUTHOR

...view details