తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ ముగ్గురి కోసం చెన్నై, ముంబయి పోటాపోటీ! - IPL Auction 2020

వచ్చే ఐపీఎల్​ సీజన్​ వేలంలో ఆటగాళ్లను తీసుకునేందుకు ఫ్రాంఛైజీలు అప్పుడే ప్రణాళికలు రచిస్తున్నాయి. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు.. ఓ ముగ్గురు క్రికెటర్లపై ఆసక్తిని కనబరుస్తున్నాయి.

CSK and MI
ఐపీఎల్

By

Published : Dec 17, 2019, 5:46 AM IST

వచ్చే ఏడాది ఐపీఎల్​ కోసం అన్ని ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల వేలంపై దృష్టిసారించాయి. ఇప్పటికే ట్రేడింగ్​ విండో ద్వారా తమకు నచ్చిన క్రికెటర్లను అంటిపెట్టుకున్న జట్లు.. కొందరిని వదులుకున్నాయి. ఫలితంగా ప్రతి టీమ్​ దగ్గర కొంత మొత్తంలో నగదు మిగిలింది. ఈనెల 19న జరిగే వేలంలో తమకు కావల్సిన వారిని దక్కించుకొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే ఈసారి ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్ కింగ్స్​ మాత్రం.. ముగ్గురు క్రికెటర్లను సొంతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారి కోసం పోటీపడబోతున్నాయి. వారెవరో చూద్దాం.

3. జేమ్స్ నీషమ్

న్యూజిలాండ్ జట్టులోప్రస్తుతం అనుభమున్న ఆల్​రౌండర్​గా ఉన్నాడు నీషమ్. అందువల్ల వచ్చే ఐపీఎల్​ సీజన్​ కోసం ఇతడిని తీసుకునేందుకు జట్లు పోటీపడే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్​కు డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ బ్యాట్స్​మెన్​ దొరకట్లేదు. గత సీజన్​లో ధోనీ.. 12 ఇన్నింగ్స్​ల్లో 416 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఇతడికి తోడుగా మరో బ్యాట్స్​మన్​ కోసం వెతుకుతోంది చెన్నై. ఇప్పుడు వీరి కళ్లు నీషమ్​పై పడ్డాయి.

ముంబయి ఇండియన్స్​లో ఆల్​రౌండర్లు అయిన హార్దిక్ పాండ్య, బెన్ కటింగ్ గాయాలతో బాధపడుతున్నారు. కటింగ్​ను వదిలేసుకున్న ముంబయి.. హార్దిక్​ను అంటిపెట్టుకుంది. కానీ అతడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. పొలార్డ్​ ఒక్కడిపైనే అధిక భారం పడే అవకాశం ఉంది. అందువల్ల మరో సరైన ఆల్​రౌండర్ కోసం రోహిత్​సేన ప్రయత్నాలు చేస్తోంది. మిడిల్, డెత్ ఓవర్లలో పొలార్డ్​కు నీషమ్​ నుంచి మద్దతు లభిస్తే ముంబయికి ఢోకా ఉండదనేది వారి ఆలోచన.

నీషమ్

2. ఇయాన్ మోర్గాన్

గత రెండు సీజన్​ల్లోనూ ఆడని మోర్గాన్​కు పరిమిత ఓవర్ల క్రికెట్​లో మంచి పేరుంది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​ను విజేతగా నిలిపిన ఇతడి కోసం ఈసారి వేలం జోరుగానే సాగనుంది. డాషింగ్​ బ్యాటింగ్​తో పాటు, కెప్టెన్​గా అనుభవాన్ని చెన్నై, ముంబయి వాడుకోవాలని చూస్తున్నాయి. మిడిల్ ఓవర్లలో బలహీనంగా కనిపిస్తోన్న రోహిత్​ సేన మోర్గాన్​ కోసం బిడ్ వేసే అవకాశం ఉంది. ముంబయి లాగా మిడిలార్డర్ సమస్యతో బాధపడుతోన్న చెన్నైకు ఇతడు ఓ ఆప్షన్​గా కనిపించనున్నాడు.

మోర్గాన్

1. టామ్ బాంటన్

21 ఏళ్ల యువ బ్యాట్స్​మన్ టామ్ బాంటన్(ఇంగ్లాండ్)..​ ఈ ఏడాది విటలిటీ బ్లాస్ట్ టీ20 లీగ్​లో అదరగొట్టాడు. 13 మ్యాచ్​ల్లో 161.47 సగటుతో 549 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. ఇతడి బ్యాటింగ్​కు బౌలర్ల దగ్గర సమాధానం లేకపోయింది. ఇప్పుడు ఈ క్రికెటర్​ గురించి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఆలోచిస్తున్నాయి. బాంటన్ కోసం వచ్చే సీజన్​లో భారీ మొత్తంలో వెచ్చించినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

చెన్నై సూపర్ కింగ్స్​కు రెండు సీజన్ల నుంచి గాయాల బెడద తప్పట్లేదు. సీనియర్ బ్యాట్స్​మన్ షేన్ వాట్సన్​ గాయాల బారిన పడుతున్నాడు. ఫలితంగా టాపార్డర్​లో ఓ యువ ఆటగాడి కోసం వెతుకుతోంది ధోనీసేన. అందుకు బాంటన్,​ వారికి ప్రత్యామ్నయంగా కనిపించొచ్చు. వచ్చే సీజన్​ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసైనా, ఇతడిని దక్కించుకునేందుకు చెన్నై ప్రణాళికలు రచిస్తోంది.

సనత్ జయసూర్య నుంచి డికాక్​ వరకు టాపార్డర్​లో ఓ డాషింగ్ విదేశీ బ్యాట్స్​మన్​ను అంటిపెట్టుకుంటోంది ముంబయి. గత సీజన్​లో ఆడిన లూయిస్​ను వదులుకున్న రోహిత్​సేన.. టాపార్డర్​ను మరింత బలంగా చేసుకునేందుకు ఈసారి బాంటన్​పై బిడ్​ వేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే రోహిత్, డికాక్, సూర్యకుమార్ యాదవ్​లతో ఓపెనింగ్​ సమస్య లేనప్పటికీ బాంటన్ వస్తే బెంచ్​ స్ట్రెంత్ బలంగా మారుతుందని ముంబయి ఆలోచన.

బాంటన్

ఇవీ చూడండి.. 'భారత్​తో టెస్టు ఆడకపోవడం దురదృష్టం'

ABOUT THE AUTHOR

...view details