ప్రముఖ ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ లాక్‌డౌన్ వేళ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నాడు. ఇటీవల ఇతడు టిక్‌టాక్ వీడియోల్లోనూ తన ప్రత్యేకత చాటుతున్నాడు. తాజాగా పీటర్సన్.. 1993లో అర్జున్ నటించిన 'జెంటిల్‌మెన్' తమిళ చిత్రంలోని ఒట్టగత్తై కట్టికో(కొంటెగాడ్ని కట్టుకో) పాటకు తనదైన స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు. ఈ వీడియోను చూసిన ఆ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమన్ దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు.
'జెంటిల్‌మెన్' పాటకు పీటర్సన్ స్టెప్పులు - kevin pietersen dance to tamil song
లాక్‌డౌన్ వేళ చాలామంది ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. సరదాగా సినిమా పాటలకు స్టెప్పులేస్తు అలరిస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ 'జెంటిల్‌మెన్' చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
పీటర్సన్
కరోనా వైరస్ ప్రభావంతో క్రీడలన్నీ స్తంభించిపోవడం వల్ల చాలా మంది ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. ఇటీవల ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా టిక్‌టాక్ వీడియోల్లో అలరించాడు. 'బుట్టబొమ్మ' పాటకు డ్యాన్స్ చేయడమే కాకుండా, 'పోకిరి' సినిమాలోని మహేశ్‌బాబు పంచ్ డైలాగ్‌ను కూడా అనుకరించి తెలుగు అభిమానులకు మరింత చేరువయ్యాడు. వీరితో పాటు చాలా మంది ఆటగాళ్లు లైవ్‌చాట్ సెషన్లు నిర్వహిస్తూ గత స్మృతులను నెమరువేసుకుంటున్నారు.