సరిగ్గా 18 ఏళ్ల క్రితం జరిగిన నాట్‌వెస్ట్ ఫైనల్‌ను గుర్తు చేసుకున్నాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. ఆ మ్యాచ్ తన జీవితాన్నే మార్చేసిందని, ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పాడు. అందుకే 2018లో అదే తేదీన రిటైర్మెంట్ ప్రకటించినట్లు వెల్లడించాడు. 2002 జులై 13న లార్డ్స్‌లో జరిగిన తుదిపోరులో ఇంగ్లాండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది.
"జులై 13కూ నాకు దగ్గర అనుబంధం ఉంటుంది. నా జీవితాన్నే మార్చేసిన ఆ తేదీని ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే 2018లో అదే రోజున రిటైర్మెంట్ ప్రకటించాను. 2002 నాట్‌వెస్ట్ ఫైనల్లో నేను ఎదుర్కొన్న అనుభవాన్ని అప్పటివరకు ఎదుర్కోలేదు. తుది పోరులో ఇంగ్లాండ్‌పై గెలిచేందుకు ఎన్నో ప్రణాళికలు వేయడం సహా చర్చలు జరిపాం. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఓడిపోతామని భావించినా చివరకు విజేతగా నిలిచాం"
-మహ్మద్ కైఫ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్