Cooch Beher Trophy Prakhar Chaturvedi : కర్ణాటక యంగ్ బ్యాటర్ ప్రఖర్ చతుర్వేది సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన అసాధారణ బ్యాటింగ్‌తో క్వాడ్రాపుల్ సెంచరీ నమోదు చేశాడు. కూచ్ బెహర్ ట్రోఫీ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. దేశవాళీ అండర్-19 స్థాయిలో నిర్వహించే నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఏకంగా 400కు పైగా పరుగులు సాధించాడు. మొత్తం 638 బంతులు ఆడిన ప్రఖర్ చతుర్వేది 46 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది 404 రన్స్ చేశాడు. ప్రఖర్ చతుర్వేది క్వాడ్రాపుల్ సెంచరీ ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కాగా, కూచ్ బెహర్ ట్రోఫీ 2023-24 ఫైనల్లో ముంబయి - కర్ణాటక జట్లు తలపడ్డాయి. కేఎస్‌సీఏ నవులే స్టేడియం వేదికగా జనవరి 12న ఈ మ్యాచ్ మొదలైంది. ఈ పోరులో ముందుగా టాస్ గెలిచిన కర్ణాటక జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబైని 113.5 ఓవర్లో 384 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆయూష్(145) శతకంతో రాణించగా సచిన్ వర్తక్(73) అర్ధ శతకంతో సత్తా చాటాడు.