తెలంగాణ

telangana

ETV Bharat / sports

జట్టు నుంచి కేఎల్​ రాహుల్​ను తప్పించాలా?.. చాట్​జీపీటీ సమాధానమిదే

గత కొద్ది కాలంగా కేఎల్​ రాహుల్​ ఫామ్​లో లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. జట్టులో అతడి స్థానంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా ఈ విషయమై.. చాట్​జీపీటీ తనదైన శైలిలో స్పందించింది. ప్రస్తుతం ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ చెప్పిన సమాధానం సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. ఆ వివరాలు..

Chat GPT Comments On KL Rahul
కేఎల్ రాహుల్‌పై చాట్​జీపీటీ కామెంట్స్

By

Published : Feb 22, 2023, 4:49 PM IST

Updated : Feb 22, 2023, 5:06 PM IST

గత కొంత కాలంగా పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్న కేఎల్​ రాహుల్​పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అతడిని జట్టును నుంచి తప్పించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత పది ఇన్నింగ్స్‌ల్లో అతడు కనీసం ఒక్క హాఫ్​సెంచరీ కూడా చేయలేదు​. అయినా సరే, రాహుల్​ను జట్టులో కొనసాగించడంపై .. సోషల్ మీడియాలో సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు క్రికెట్​ ప్రేమికులు. దీంతో కంగారూలతో జరిగే మిగతా రెండు టెస్టులకు రాహుల్ వైస్​ కెప్టెన్​ ట్యాగ్​ను తొలగించారు. ఈ క్రమంలోనే తుది జట్టులోనూ రాహుల్​ను కొనసాగిస్తారా అనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీమ్‌ఇండియా మాజీ ప్లేయర్స్ వెంకటేశ్‌ ప్రసాద్, ఆకాశ్‌ చోప్రా, హర్భజన్ సింగ్‌, సీనియర్ ఆటగాడు దినేశ్‌ కార్తిక్.. రాహుల్‌ను పక్కన పెట్టాలని ఇప్పటికే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అయితే మరోవైపు ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ చాట్‌జీపీటీ గురించి అంతా మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్లాట్​ఫామ్​.. కేఎల్‌ రాహుల్‌ గురించి మాట్లాడింది. అతడిని జట్టులో ఉంచాలా..? లేదా..? అనే విషయమై మాట్లాడింది. ఓ అభిమాని రాహుల్​ గురించి అడిగిన ప్రశ్నను.. తనదైన శైలిలో అద్భుతమైన సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఓ అభిమాని.. భారత టెస్టు టీమ్​ నుంచి కేఎల్ రాహుల్‌ను తప్పించాలా..? అని అడగగా.. వ్యక్తులు, జట్లపై నాకంటూ పర్సనల్​గా పక్షపాత అభిప్రాయం ఏమి లేదు. సాధారణంగా రూల్‌ ప్రకారం.. ఇటీవల ఆటగాడి ప్రదర్శన, ఫిట్‌నెస్ ఆధారంగానే అతడిని జట్టులో నుంచి తప్పించడానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జట్టు అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలు, సామర్థ్యాలు లేనప్పుడు నిర్ణయం తీసుకోవాలి. తాజా టెస్టుల్లో కేఎల్ రాహుల్‌ ప్రదర్శన నిరాశగానే ఉంది. అతడి కంటే అద్భుతంగా ఆడే సత్తా ఉన్నవారు జట్టులో ఉన్నారు. కాబట్టి, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడిని పక్కకు పెట్టేందుకు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. రాహుల్​ బాగా రాణిస్తున్నాడు.. జట్టు అవసరాలకు తగ్గట్టుగా కీలక పాత్ర పోషిస్తున్నాడు అనుకుంటే టీమ్‌లో కొనసాగించవచ్చు. చివరిగా, టీమ్‌ సెలక్టర్లు మాత్రమే అతడి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అది కూడా ఆటగాడి ఫామ్‌, ఫిట్‌నెస్‌, జట్టు వ్యూహాలు, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చాట్​జీపీటీ చెప్పింది.

Last Updated : Feb 22, 2023, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details