తెలంగాణ

telangana

ETV Bharat / sports

టవల్​తో క్యాచ్ - 5 పరుగుల పెనాల్టీ - క్రికెట్​లో ఈ రూల్ మీకు తెలుసా?

Catch Ball with Towel : క్రికెట్​లో ఒక్కోసారి చిన్న చిన్న తప్పిదాలు మ్యాచ్ ఫలితాలను మార్చేస్తాయి. తాజాగా మహిళల బిగ్​బాష్​ లీగ్​లోనూ అలాంటి తప్పిదమే జరిగింది. పొరపాటుగా చేతిలో టవల్ ఉండగా బంతిని అందుకున్న కారణంగా.. ఫీల్డింగ్ జట్టుకు 5 పరుగులు పెనాల్టీ విధించాడు అంపైర్.

catch ball with towel in wbbl
catch ball with towel in wbbl

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 12:45 PM IST

Catch Ball with Towel :2023 మహిళల బిగ్​బాష్ లీగ్​లో భాగంగా తాజాగా బ్రిస్బేన్ హీట్ - సిడ్నీ సిక్సర్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఐసీసీ నిబంధనల పట్ల అవగాహన లేక ఈ మ్యాచ్​లో బ్రిస్బేన్ హీట్.. సిడ్నీ సిక్సర్స్​ జట్టుకు 5 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. అదనంగా దక్కిన 5 పరుగులతోనే మ్యాచ్​లో సిడ్నీ సిక్సర్స్​ నెగ్గింది. ఫలితంగా బ్రిస్బేన్ హీట్ ఓటమిని చవిచూసింది.

ఇదీ విషయం..ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన సిడ్నీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్లు ఎల్లిస్ పెర్రీ (20), సుజీ బీట్స్ (26) ఫర్వలేదనిపించారు.

అయితే మ్యాచ్ జరగుతున్న అల్లెన్ బోర్డర్ మైదానంలో మంచు ప్రభావం పెరిగింది. ఈ కారణంగా ప్లేయర్లంతా ఎప్పటికప్పుడు టవల్​తో చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. ఇక 9 ఓవర్లు ముగిసేసరికి సిడ్నీ.. 74-2తో నిలిచింది. అప్పటికి సిడ్నీ విజయానికి 66 బంతుల్లో 103 పరుగులు కావాలి. దీంతో బ్రిస్బేన్ జట్టుకే మ్యాచ్​ గెలిచే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి.

10 ఓవర్ వేయడానికి అమిలియా కేర్ బంతి అందుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని క్రీజులో ఉన్న గార్డ్​నర్ మిడ్​వికెట్ మీదుగా ఆడింది. అక్కడే ఫీల్డింగ్​లో ఉన్న ప్లేయర్.. బంతి అందుకొని కేర్​ వైపు విసిరింది. ఆ సమయంలో కేర్.. చేతిలో టవల్ ఉండగానే బంతిని అందుకుంది. వెంటనే అంపైర్​ ఆమె తప్పిదాన్ని గుర్తించి.. 5 పరుగుల పెనాల్టీ వేశాడు. ఈ ఐదు పరుగులను సిడ్నీ జట్టుకు కలిపాడు. అంతే ఒక్కసారిగా బ్రిస్బేన్ జట్టు ఒక్కసారిగా షాక్​కు గురైంది. సిడ్నీ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 లక్ష్యాన్ని అందుకుంది. ఆ 5 పరుగులు అదనంగా రాకపోయి ఉంటే.. సిడ్నీ చివరి రెండు 7 పరుగులు కావాల్సి వచ్చేది. దీంతో మ్యాచ్ ఫలితం మారే ఛాన్స్ ఉండేది.

అయితే మ్యాచ్​ సమయంలో.. ఏ వస్తువులతోనైనా బంతిని అడ్డుకున్నా, వికెట్ కీపర్ హెల్మెట్ కిందపెట్టినప్పుడు బంతి తాకినా, ఐసీసీ రూల్స్​ 28.2 నిబంధన ప్రకారం 5 పరుగులు పెనాల్టీగా విధిస్తారు. కానీ, ఇప్పటివరకు ఇది ఎవరికి తెలియదు.

ఇకపై వారికి క్రికెట్​లో నో ఛాన్స్! - పూర్తిగా నిషేధించిన ఐసీసీ

డ్రెస్సింగ్ రూమ్​లోకి ప్రధాని-టీమ్‌ఇండియా ఆటగాళ్లను ఓదార్చిన మోదీ

ABOUT THE AUTHOR

...view details