Bumrah Ireland T20 : టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సూమారు ఏడాది నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా అతను ఫిట్‌నెస్ టెస్ట్‌ను అధిగమించి మైదానంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఐర్లాండ్‌తో ఆగస్ట్ 18 నుంచి జరగనున్నటీ20 సిరీస్‌లో పాల్గొని మరోసారి తన సత్తా చాటనున్నాడు. అయితే ఈ సారి మేనేజ్‌మెంట్ అతని విషయంలో గట్టి నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్ టీ20లో అడుగుపెట్టనున్న బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువరించింది. బీసీసీఐ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడే గాయం నుంచి కోలుకున్న అతనిపై వన్డే ప్రపంచకప్ ముంగిట ఇలా అనవసరమైన ఒత్తిడి ఎందుకు పెడుతున్నారంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం బుమ్రాకు ఇది రెండోసారి. గతంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు (రీషెడ్యూల్ చేసిన మ్యాచ్)ను టీమ్ఇండియా బుమ్రా నాయకత్వంలోనే ఆడింది.
మరోవైపు ఐర్లాండ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్ తర్వాత భారత జట్టు నేరుగా ఆసియా కప్‌లోనే తలపడనుంది. ఈ క్రమంలో వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ మినీ టోర్నీ కోసం టీమ్ఇండియా అన్ని రకాలుగా సిద్ధమౌతోంది. అందుకోసమే..తాజాగా జరుగుతున్న విండీస్ సిరీస్‌లోనూ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలోనూ పలు ప్రయోగాలు చేస్తోంది. ఫలితాన్ని పక్కనబెట్టి ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో మేనేజ్‌మెంట్ చేస్తున్న పని అభినందనీయమే అయినప్పటికీ.. ఇటువంటి కీలక సమయాల్లో ప్రయోగాలు అవసరం లేదనేది క్రికెట్ మాజీల అభిప్రాయం. కానీ బుమ్రా విషయంలో బీసీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రయోగం అనే కన్నా రానున్న ఆసిస్ సిరీస్‌కు అతడ్ని రెడీ చేసేందుకే ఐర్లాండ్ సిరీస్ బాధ్యతలు అతనికి అప్పజెప్పిందని భావించాలి.