తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ ఒకటి చెబితే బీసీసీఐ మరొకటి చెబుతోంది'

టీ20 కెప్టెన్సీకి గుడ్​బై చెప్పబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు విరాట్ కోహ్లీ(virat kohli news). దీనిపై స్పందించాడు టీమ్ఇండియా మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్.

Virat Kohli
కోహ్లీ

By

Published : Sep 18, 2021, 5:32 AM IST

యూఏఈలో జరిగే టీ20 ప్రపంచకప్‌ అనంతరం పొట్టి ఫార్మాట్‌ సారథ్య బాధ్యతలను వీడతానని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(virat kohli news) గురువారం ప్రకటించాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి కెప్టెన్‌గా కోహ్లీ(virat kohli t20 captaincy record) తప్పుకుంటాడని కొంత కాలంగా వార్తకథనాలు వచ్చాయి. ఇవన్నీ ఊహాగానాలే బీసీసీఐ(bcci news) కొట్టిపారేసింది. కెప్టెన్సీ మార్పు ఉండబోదని, అన్ని ఫార్మాట్లలో కోహ్లీయే సారథిగా కొనసాగుతాడని వెల్లడించింది. ఇది జరిగి రెండు రోజులు కూడా కాకముందే విరాట్ కోహ్లీ(virat kohli news) అందరికీ షాక్‌ ఇచ్చాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్‌, సెలెక్టర్‌ సందీప్‌ పాటిల్‌(sandeep patil cricketer) స్పందించాడు. బీసీసీఐ, విరాట్‌కు మధ్య చాలా కమ్యూనికేషన్‌ గ్యాప్ ఉందని పేర్కొన్నాడు.

"ఇదంతా చూస్తుంటే బీసీసీఐ, కోహ్లీకి మధ్య సమాచారం, అవగాహన లోపం ఉన్నట్టు అనిపిస్తోంది. విరాట్‌ ఒకటి చెబితే బీసీసీఐ మరొకటి చెబుతోంది. కొన్ని రోజుల క్రితం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని వార్తలు వస్తే బీసీసీఐ వాటిని కొట్టిపారేసింది. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అనేది పూర్తిగా విరాట్ కోహ్లీ నిర్ణయం. బీసీసీఐ దాన్ని అంగీకరించాలి. కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఓ వైపు కెప్టెన్సీ, మరోవైపు బ్యాటింగ్‌పై దృష్టిపెట్టడం తేలికైన పని కాదు. విరాట్‌ తీసుకున్న నిర్ణయం అతడు బ్యాటింగ్‌ దృష్టిపెట్టడానికి ఉపయోగపడుతుంది" అని సందీప్ పాటిల్(sandeep patil cricketer) వివరించాడు.

ఇవీ చూడండి: అంతమాత్రాన కెరీర్ ముగిసినట్లు కాదు: సిరాజ్

ABOUT THE AUTHOR

...view details