పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఇటీవల వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. మూడేళ్లుగా టాప్‌లో ఉన్న టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే బాబర్ మొదటి ర్యాంకుకు పరోక్షంగా కోహ్లీనే కారణమట! ఆ విషయాన్ని స్వయంగా పాక్ కెప్టెన్ ఓ క్రీడా ఛానల్‌తో వెల్లడించాడు.
ఇదీ చదవండి:టేబుల్ టెన్నిస్‌లో భారత కుర్రాడి సత్తా
"గతంలో నెట్స్‌లో సాధన చేసేటప్పుడు సాధారణ మనస్తత్వంతో ఆడేవాడిని. కానీ, ఓ సారి విరాట్‌తో మాట్లాడినప్పుడు.. మ్యాచ్‌లో లాగే నెట్స్‌లోనూ సీరియస్‌గా దృష్టి సారించమని సలహా ఇచ్చాడు. నెట్స్‌లో ఎలా అయితే షాట్ల ఎంపిక ఉంటుందో మ్యాచ్‌లోనూ అలాగే ఉంటుంది. అప్పటి నుంచి కోహ్లీ చెప్పినట్లు చేస్తూ వచ్చాను. నెట్స్‌లో ఎంత ప్రాక్టీస్ చేసినా సంతృప్తి ఉండట్లేదు. అంతలా సాధన చేస్తున్నా. " అని అజామ్ పేర్కొన్నాడు.
ఇక టెస్టుల్లో..