Babar Azam on Virat Kohli: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఘనవిజయం సాధించింది. అనంతరం ఆటగాళ్లు పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో కోహ్లీతో ఏదో మాట్లాడాడు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్. చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు. తాజాగా ఇదే విషయమై అజామ్‌ను ప్రశ్నించాడు ఓ విలేకరి. దీనిపై అసహనం వ్యక్తం చేశాడు అజామ్.
కోహ్లీతో ఏం మాట్లాడారని ప్రశ్న.. బాబర్ అజామ్ సీరియస్ - విరాట్ కోహ్లీ లేటెస్ట్ న్యూస్
Babar Azam on Virat Kohli: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది పాక్. అయితే ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీతో మాట్లాడిన అజామ్.. అతడికి ఏదో చెప్పాడు. ఇదే విషయంపై అజామ్‌ను ఓ విలేకరి ప్రశ్నించగా.. అందుకు అతడు అసహనం వ్యక్తం చేశాడు.
babar azam
'మా మధ్య ఏం జరిగిందో అందరి ముందు చెప్పను. అది మా ఇద్దరి మధ్య విషయం. దానిని మీ ముందు చెప్పాల్సిన అవసరం లేదు' అంటూ సమాధానమిచ్చాడు అజామ్.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాపై ఆది నుంచి పాకిస్థాన్ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. 20ఓవర్లకు భారత జట్టు 151 పరుగులు సాధించింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో స్వేచ్ఛగా ఆడిన పాక్.. 10వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌లో భారత్‌పై తొలి గెలుపును ఆస్వాదించింది.