పాక్ సారథి బాబార్ అజామ్ కొత్త రికార్డు సాధించాడు. ఆ దేశ జట్టుకు కెప్టెన్‌గా ఆడిన మొదటి నాలుగు టెస్టుల్లో విజయం సాధించి, ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి పాక్ సారథిగా నిలిచాడు. సోమవారం జరిగిన రెండో టెస్టులో జింబాబ్వేపై ఇన్నింగ్స్ 147 పరుగులు తేడాతో పాకిస్థాన్ గెలిచింది. ఫలితంగా 2-0 తేడాతో టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ విజయంతోనే ఈ ఘనత అందుకున్నాడు బాబర్.
అలానే పాక్ జట్టు మరో ఘనత కూడా సాధించింది. ఓ ఏడాదిలో వరుసగా ఆరుసార్లు లేక అంతకంటే ఎక్కువ సిరీస్‌ల్లో విజయం సాధించడం దాయాది జట్టుకు ఇది ఆరోసారి కావడం విశేషం. అంతకుముందు 1993-94(6), 2001-02(6), 2011-12(13), 2015-16(9), 2017-18(6) వరుస సిరీస్‌ల్లో విజయాలు అందుకుంది.