తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS WI : 'మీకు ఇతనే దొరికాడా.. !'.. టీమ్​ఇండియా సెలక్షన్ కమిటీపై ఫైర్​ - విండీస్​ టూర్​కు ఆవేశ్​ ఖాన్​

వెస్టిండీస్‌లో తతో టీ20లపడనున్న టీమ్​ఇండియా జట్టు సెలెక్షన్​పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఫామ్‌లో లేని ఓ ఫాస్ట్‌ బౌలర్‌ ఎంపికపై తీవ్ర చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ అతనెవరంటే ?

Avesh khan india vs west indies
Avesh khan

By

Published : Jul 6, 2023, 1:06 PM IST

Updated : Jul 6, 2023, 1:18 PM IST

Avesh Khan West indies : కొద్ది రోజుల్లో విండీస్​తో సిరీస్​ సిద్ధం కానున్న నేపథ్యంలో టీమ్​ఇండియా జట్టును ప్రకటించింది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో పోరుకు సిద్ధం కానున్న ఈ జట్టు.. రానున్న మ్యాచ్​ల కోసం ఇప్పటికే తీవ్ర కసరత్తులు చేస్తోంది. అయితే ఈ సిరీస్ కోసం​ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన జట్టుపై సర్వత్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఫామ్‌లో లేని ఫాస్ట్‌ బౌలర్‌ ఆవేశ్​ ఖాన్‌ ఎంపిక విషయాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఐపీఎల్‌ 16లో అదరగొట్టిన కోల్​కతా టీమ్​ ఆటగాడు రింకూ సింగ్‌ను సెలక్టర్లు పక్కనబెట్టిన విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Avesh Khan IPL : గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఆవేశ్​.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లోనూ అదే తరహాలో ఆడి అభిమానులను నిరాశపరిచాడు. ఐపీఎల్‌-2023లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన అవేశ్​.. 9.75 ఏకానమితో 9 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు జాతీయ జట్టు తరపున వచ్చిన అవకాశాలను కూడా అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ క్రమంలో గతేడాది భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆవేశ్​.. పెద్దగా రాణించకపోవడం వల్ల తుది జట్టులో చోటును సంపాదించలేకపోయాడు. దీంతో సుమారు ఏడాది నుంచి అతడు జట్టుకు దూరంగా ఉన్నాడు.

అయితే అనూహ్యంగా సెలక్టర్లు ఇప్పుడు విండీస్​ పర్యటన కోసం అతడికి పిలుపునివ్వడం వల్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతడి స్ధానంలో ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన తుషార్‌ దేశ్‌ పాండే లేదా ఆకాష్‌ మధ్వాల్‌ లాంటి మేటి ప్లేయర్లకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. నెట్టింట ఈ విషయంపై తీవ్ర చర్చలు చేస్తున్నారు. 'మీకు ఈ ఓవరాక్షన్‌ స్టారే దొరికాడా' అంటూ సెలక్టర్లు ఉద్దేశించి నెట్టింట అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు.

Avesh Khan Helmet Throw : ఐపీఎల్‌-2023లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తొలిసారి తలపడిన మ్యాచ్‌లో లఖ్​నవూ సూపర్​ జెయింట్స్ జట్టు అనూహ్య రీతిలో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఓటమి తప్పదు అనుకున్న తరుణంలో ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడం వల్ల లఖ్​నవూ జట్టు జయకేతనం ఎగురవేసింది. ఈ సమయంలో క్రీజులో ఉన్న ఆవేశ్‌ ఖాన్‌ ఓవర్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

హెల్మెట్‌ తీసి నేలకేసి కొట్టి మరీ మైదానంలో తన దూకుడును ప్రదర్శించాడు. దీంతో అప్పట్లో ఆవేశ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్‌ మీడియాలో అతన్ని దారుణంగా ట్రోల్‌ కూడా చేశారు. ఇక ఇప్పటివరకు టీమ్​ఇండియా తరపున ఐదు వన్డేలు, 15 టీ20లు ఆడిన ఆవేశ్​ ఖాన్‌ వరుసగా 3, 13 వికెట్లు పడగొట్టాడు.

Last Updated : Jul 6, 2023, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details