తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​ పర్యటనకు టీమ్​ఇండియా.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!

Asia Cup 2023 : వచ్చే ఏడాది జరగబోయే ఆసియా కప్​ కోసం భారత జట్టు పాకిస్థాన్​ వెళ్లబోయేది లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. అది తటస్త వేదికలో జరుగుతుందని తెలిపారు. ఇక ఆ విషయంలో తుది నిర్ణయం భారత ప్రభుత్వానిదే అని తెలిపారు.

asia cup 2023
asia cup 2023

By

Published : Oct 18, 2022, 4:09 PM IST

Updated : Oct 18, 2022, 5:54 PM IST

Asia Cup 2023 : వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్​ కోసం భారత జట్టు పాకిస్థాన్​ వెళ్లనుందనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. వీటన్నిటికీ తెరదించుతూ బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. టీమ్ ఇండియా పాకిస్థాన్​లో పర్యటించబోదని స్పష్టం చేశాడు. ఆసియా కప్​ కూడా పాకిస్థాన్​లో జరగదని.. తటస్త వేదికలో జరుగుతుందని పేర్కొన్నారు. మంగళవారం ముంబయిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం) షా ఈ వ్యాఖ్యలు చేశారు.

"2023 ఆసియా కప్​ తటస్త వేదికలో జరుగుతుంది. పాకిస్థాన్​లో భారత్​ పర్యటన చేయాలా లేదా అనే విషయం ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దానిపై మేము కామెంట్లు చేయదలచుకోలేదు. దీంతో పాటు 2025 లో జరగబోయే ఛాంపియన్​షిప్​ ట్రోఫీ వేదిక కుడా నిర్ణయించలేదు. వేదిక నిర్ణయించాక దాని వివరాలు వెల్లడిస్తాం. మీడియా హక్కుల వల్ల మాకు మంచి ఆదాయం వస్తోంది. ఈ ఆదాయం వల్ల దేశీయ ప్లేయర్లకు మంచి జరగాలన్నదే మా ఉద్దేశం" అని జై షా అన్నారు.

అయితే 2023లో ఆసియా కప్​ టోర్నమెంట్ పాకిస్థాన్​లో జరగాలి. కానీ కొన్ని కారణాల వల్ల తటస్త వేదకలో జరుగుతుంది. దీని కారణంగానే భారత జట్టు పాకిస్థాన్​లో పర్యటిస్తుందనే ఊహాగానాలు వచ్చాయి. తాజాగా జైషా ఆ ఊహాగానాలకు తెరదించారు. కాగా, మంగళవారం ముంబయిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం) కొత్త కార్యవర్గ సభ్యులను ఎన్నుకుంది బీసీసీఐ. రోజర్​ బిన్నీ అధ్యక్షుడిగా, జై షా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జై షా బీసీసీఐ కార్యదర్శితో పాటు ఆసియన్ క్రికెట్​ కౌన్సిల్ అధ్యక్షుడిగానూ ఉన్నారు. కాగా, గత మూడేళ్లలో బీసీసీఐ ఆదాయం రూ.3648 కోట్ల నుంచి రూ.9629 కోట్లకు చేరిందని బీసీసీఐ కోశాధికారిగా వ్యవహరించి, ఐపీఎల్ కొత్త​ ఛైర్మన్​గా ఎన్నికైన అరుణ్ ధుమాల్​ వెల్లడించారు. ఇది మూడు రెట్లు ఎక్కువ అని అన్నారు. రాష్ట్ర విభాగాలకు ఇచ్చే ఆదాయంలో ఐదు రెట్లు పెరుగుదల ఉందన్నారు.

ఇవీ చదవండి :చిన్న టీమ్​ల పెద్ద దెబ్బ.. ఛాంపియన్లకు వరుస షాక్​లు.. బహుపరాక్!

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. ఎన్నిక ఏకగ్రీవం

Last Updated : Oct 18, 2022, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details