Asia CuP 2023 Ishan Kishan Score : వన్డే ప్రపంచకప్‌నకు ఇంకో నెల రోజులే సమయం మిగిలి ఉంది. మరి ఈ టోర్నీలో భారత జట్టుకు వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకునేది ఎవరు? పంత్ స్థానాన్ని భర్తి చేసే టాలెంట్ స్కిల్స్ ఎవరికి ఉన్నాయి? వీక్‌గా ఉన్న మిడిలార్డర్‌కు అండగా నిలిచేదెవరు? వంటి ప్రశ్నలన్నింటికీ ఒక్క ఇన్నింగ్స్‌తో ఆన్సర్ ఇచ్చేశాడు ఇషాన్ కిషన్. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అతడు ఆడిన ఇన్నింగ్స్ అలాంటిది మరి. ఇది టీమ్‌ఇండియాకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చిందనే చెప్పాలి.
Asia CuP 2023 Ishan Kishan : ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం చెప్పేశాడు.. వరల్డ్ కప్ టెన్షన్ కాస్త తగ్గినట్టే! - ఆసియా కప్ 2023 ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్
Asia CuP 2023 Ishan Kishan Score : టాప్ ఆర్డర్‌లోని స్టార్ బ్యాటర్లంతా విఫలమైనా.. పాక్ పేస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని మరీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఇషాన్ కిషన్. ఈ ప్రదర్శనతో హాట్‌టాపిక్‌గా మారిన అతడు.. వచ్చే ప్రపంచ కప్ రేసులోకి దూసుకెళ్లాడు.
Published : Sep 3, 2023, 7:29 PM IST
సొంతగడ్డపై జరగనున్న వరల్డ్ కప్‌లో భారీ అంచనాలతోనే టీమ్ఇండియా బరిలోకి దిగుబోతోంది. ఫేవరెట్ జట్టే అయినప్పటికీ వరల్డ్ కప్ దిశగా మన జట్టు సరైన సన్నద్ధతతో ముందుకెళ్తుందా అనేది మాత్రం అనుమానమే. కొందరు ప్లేయర్స్ ఫామ్, ఫిట్‌నెస్ ఆందోళన కలిగిస్తోంది. ఏ స్థానంలో ఎవరు ఆడతారనే విషయంపై క్లారిటీ లేదు.
Asia cup 2023 IND VS PAK : అయితే పాకిస్థాన్‌తో శనివారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్ ఫ్యాన్స్‌లో మరింత ఆందోళనను పెంచింది. ఈ కీలక మ్యాచ్‌లో అదిరే ప్రదర్శన చేస్తారని ఆశించిన సీనియర్ బ్యాటర్లు కోహ్లీ, రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశ పరిచారు. మిగతా టాప్ ఆర్డర్ బ్యాటర్లు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. అయితే స్వతహాగా ఓపెనర్ అయిన ఇషాన్ కిషన్.. జట్టు అవసరాల కోసం మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగి హార్దిక్ పాండ్యతో కలిసి చక్కటి పార్ట్నర్ షిప్ నెలకొల్పాడు. భీకరంగా ఉన్న పాక్ పేస్ దాడిని అతడు ఫేస్ చేసిన విధానం.. ఆకట్టుకుంది. టీమ్‌కు గొప్ప భరోసాను ఇచ్చింది. పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోయినా.. గొప్ప పరిణతి చూపిస్తూ ఆడాడు. సంయమనంతో ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు. అంతేకాకుండా సమయోచితంగా కూడా షాట్లూ పేస్, స్పిన్ అని తేడా లేకుండా ప్రతి బౌలర్లనూ సమర్థంగా ఫేస్ చేశాడు. వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో జట్టుకు ఇలాంటి ప్రదర్శన మంచి విషయమనే చెప్పాలి.