ఏకపక్షంగా ఆసియా కప్ తొలి మ్యాచ్, అఫ్గాన్‌పై చిత్తుగా ఓడిన శ్రీలంక
22:18 August 27
ఏకపక్షంగా ఆసియా కప్ తొలి మ్యాచ్, అఫ్గాన్‌పై చిత్తుగా ఓడిన శ్రీలంక
ఆసియా కప్ తొలి మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఐదుసార్లు ఆసియా కప్ ఛాంపియన్ అయిన శ్రీలంకకు ప్రారంభ మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్ షాకిచ్చింది. శ్రీలంకపై అన్ని రంగాల్లో ఆదిపత్యం చెలాయించింది. తొలుత బౌలింగ్‌లో లంకను 105కే కట్టడి చేసిన అఫ్గాన్.. అనంతరం ఛేదనలో రికార్డు వేగంతో పని పూర్తి చేసింది. కేవలం 10.1 ఓవర్లలోనే ఇన్నింగ్స్ ముగించింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నబీ సేన ఆదిలోనే శ్రీలంకను కోలుకోలేని దెబ్బ తీసింది. 5 పరుగులకే 3 కీలక వికెట్లు తీసి టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. ఏ బ్యాట్స్‌మెన్‌నూ బౌలర్లు కోలుకోనివ్వలేదు. రాజపక్స (38*), కరుణరత్నె (31), గుణతిలక (17) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఫరూకి 3 వికెట్లు తీయగా.. ముజీబ్, నబీ తలో రెండు వికెట్లు తీశారు.
ఆపై బ్యాటింగ్‌కు దిగిన నబీ సేన 2 రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాస విజయం సాధించింది. ఆ జట్టు కేవలం 10.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించడం విశేషం. ముఖ్యంగా ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ సిక్సులతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 18 బంతుల్లోనే అతడు 40 పరుగులు సాధించడం విశేషం. హజ్రతుల్లా జజాయ్ (37) అతడికి సహకారం అందించాడు.