అజింక్యా రహానే(ajinkya rahane news) బ్యాటింగ్‌లో సత్తా చాటేందుకు త్వరలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్(IND vs NZ Test Series) ఓ మంచి అవకాశమని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. తొలి టెస్టుకు విరాట్ కోహ్లీ గైర్హాజరీతో రహానె కెప్టెన్‌గానూ వ్యవహరించనున్నాడు.
రహానేకు ఇది సువర్ణావకాశం: గంభీర్ - అజింక్యా రహానే గురించి గౌతమ్ గంభీర్
త్వరలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ అజింక్యా రహానే(ajinkya rahane newsకు ఓ సువర్ణావకాశమని తెలిపాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఈ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు.
"త్వరలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్(IND vs NZ Test Series)లో తొలి టెస్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోవాలి. బ్యాటింగ్‌లో తన సత్తా చాటేందుకు ఇదో సువర్ణావకాశం. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగాలి. శుభ్‌మన్ గిల్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాలి" అని గంభీర్ సూచించాడు. న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య నవంబరు 25 నుంచి కాన్పుర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.
కొద్ది రోజులుగా రహానే ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. చివరి సారిగా ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో రహానే ఓ శతకం, మరో అర్ధ శతకంతో రాణించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కీలక ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. కరోనా కారణంగా ఇంగ్లాండ్‌తో అర్ధాంతరంగా వాయిదా పడిన టెస్టు సిరీస్‌లో కూడా రహానే ఘోరంగా విఫలమై.. జట్టులో చోటు కోల్పోయాడు.