భారత్-ఎ, అండర్-19, జాతీయ మహిళా క్రికెట్ జట్టుతో పనిచేసిన మాజీ క్రికెటర్ అభయ్ శర్మ(abhay sharma fielding coach).. టీమ్ఇండియా పురుషుల జట్టు ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మేరకు బీసీసీఐకి అతడు దరఖాస్తు చేసుకున్నాడని ఓ అధికారి స్పష్టం చేశారు.
నవంబర్ 3న దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. ఈ నేపథ్యంలో అభయ్.. ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు సమర్పించాడు. ప్రధాన కోచ్ పదవి బరిలో ఉన్న దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌తో(Rahul Dravid as coach) కలిసి పనిచేసిన అనుభవం అభయ్‌కి ఉంది. ఇండియా ఏ, అండర్ 19 జట్లకు ద్రవిడ్ కోచ్‌గా పనిచేసినప్పుడు అభయ్ ఆ జట్లకు సేవలందించాడు.
అభయ్.. దిల్లీ, రైల్వేస్, రాజస్థాన్ జట్ల తరఫున 89 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 2016లో భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా జింబాబ్వేకు వెళ్లాడు. అదే ఏడాది భారత జట్టు అమెరికా, వెస్టిండీస్ పర్యటనల్లోనూ అభయ్ పాలుపంచుకున్నాడు.