ab de villiers vs kohli : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లతో పోటీపడాలనుందని సౌత్ఆఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో విరాట్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానన్నాడు. అతడు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయలు పంచుకున్నాడు.
కాగా డివిలియర్స్, కింగ్ కోహ్లీతో కలిసి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. వీరిద్దరూ కలిసి మైదానంలో అనేక సార్లు పరుగుల పారించి.. ఆర్సీబీ జట్టుకు ఎన్నో అసాధారణ విజయాలు అందించారు. గతంలో కూడా డివిలియర్స్.. కోహ్లీపై పలుమార్లు ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్లో సుదీర్ఘ కాలం అతడు ఆర్సీబీకి జట్టుకే ఆడాడు. ఇక ప్రస్తుతం క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్.. తన 360 డిగ్రీల ఆటతీరుతో డివిలియర్స్‌ను తలపిస్తున్నాడు.
"నాకు ఇప్పటికీ క్రికెట్ ఆడాలని ఉంది. కాని ఇప్పుడు ఆ అవకాశం లేదు. నా కెరీర్‌ను నేను అత్యుత్తమంగా ముగించలేదు. ఏడాదికి రెండు, మూడు నెలలు క్రికెట్ ఆడాలనుకోలేదు. ఎందుకంటే నేను ప్రపంచంలో గొప్ప బ్యాటర్‌గా ఉండాలనుకున్నా. కానీ సంవత్సరానికి మూడు నెలలు ఆడితే.. అది సాధ్యం కాదు. ఒకవేళ నేను మళ్లీ పిచ్‌లో అడుగుపెడితే.. విరాట్, సూర్యలతో పోటీపడాలని ఉంది"