దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్(AB De Villiers retirement) క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2018 మే నెలలో దక్షిణాఫ్రికా జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ(De villiers news).. ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడలేదు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చాడు. ప్రస్తుత నిర్ణయంతో ఆర్సీబీ నుంచి కూడా దూరం కానున్నాడు.
"క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్ను నేను ఎంజాయ్ చేశాను. ఇక 37 ఏళ్ల వయసు వచ్చేసింది కదా అందుకే రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాను"
-- ఏబీ డివిలియర్స్, మాజీ క్రికెటర్.