విరాట్ - అనుష్క.. హార్దిక్ - నటాషా.. తాజాగా గుత్తా జ్వాల - విష్ణు విశాల్.. ఇలా సినీతారలు, క్రీడాకారుల మధ్య ప్రేమ చిగురుస్తుంది. తాజాగా తమిళ హీరో విష్ణు విశాల్‌తో బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలడేటింగ్ చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు షేర్ చేశారు వీరిద్దరూ. ఫలితంగా ఈ వార్తలకు ఇది బలం చేకూరుస్తోంది.
"మై బేబీ.. హ్యాపీ న్యూ ఇయర్" అంటూ ట్విట్టర్ వేదికగా విష్ణుపై ప్రేమను తెలియజేసింది గుత్తా జ్వాల. ఇన్ స్టాలోనూ అతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోను పంచుకుందీ బ్యాడ్మింటన్ స్టార్. ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.