తెలంగాణ

telangana

ETV Bharat / sports

వియత్నాం ఓపెన్​ విజేతగా సౌరభ్​ వర్మ - భారత్​ యువ షట్లర్​ సౌరభ్​​ వర్మ

భారత యువ షట్లర్​ సౌరభ్​​ వర్మ సంచలనం సృష్టించాడు. వియత్నాం ఓపెన్​ టైటిల్ గెలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్​ ఫైనల్లో సన్​ ఫె జియాంగ్​(చైనా​)ను ఓడించాడు.

వియత్నాం ఓపెన్​ విజేతగా సౌరభ్​ వర్మ

By

Published : Sep 15, 2019, 3:14 PM IST

Updated : Sep 30, 2019, 5:12 PM IST

వియత్నాం ఓపెన్​ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు భారత యువ షట్లర్​ సౌరభ్​ వర్మ. పురుషుల సింగిల్స్​ సూపర్ 100 విభాగంలో పోటీపడిన ఈ ఆటగాడు... ఆదివారం జరిగిన ఫైనల్లో సన్​ ఫె జియాంగ్​(చైనా​)ను ఓడించాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్​లో 21-12, 17-21, 21-14 తేడాతో గెలిచాడు సౌరభ్​.

నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్​లో తొలి రెండు సెట్లను చెరొకరు గెలుచుకోగా.. కచ్చితంగా నెగ్గాల్సిన మూడో సెట్​లో తిరుగులేని స్మాష్​లతో ప్రత్యర్థిని వణికించాడు సౌరభ్​. చివరికి 7 పాయింట్ల ఆధిక్యంతో సెట్​ కైవసం చేసుకుని టోర్నీ విజేతగా నిలిచాడు.

శనివారం జరిగిన సెమీస్​లో మినోరు కొగా(జపాన్​)ను ఓడించాడు. ఈ మ్యాచ్​ను 22-20, 21-15 వరుస సెట్లలో గెలిచాడు సౌరభ్​. ఈ మ్యాచ్​ 51 నిమిషాల పాటు సాగింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్​ ర్యాంకింగ్స్​లో 38వ స్థానంలో కొనసాగుతున్నాడు సౌరభ్.

Last Updated : Sep 30, 2019, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details