తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మలేసియా ఓపెన్​'లో భారత షట్లర్లకు నిరాశే! - ఓటమి

మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్​లో భారత షట్లర్లు నిరాశ పరిచారు. తాజాగా కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్​లో ఓటమితో ఇంటిదారి పట్టాడు.

శ్రీకాంత్

By

Published : Apr 5, 2019, 4:29 PM IST

మలేసియా ఓపెన్​లో భారత షట్లర్ల పరాజయం పరిపూర్ణమైంది. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి సైనా.. సింధులు నిష్క్రమించారు. తాజాగా పురుషుల సింగిల్స్​లో కిదాంబి శ్రీకాంత్​.. చైనా బ్యాడ్మింటన్​ దిగ్గజం చెన్​లాంగ్​తో పోరాడి ఓడాడు. క్వార్టర్​పైనల్​లో 18-21, 19-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం చెందాడు.ఇలా వరుసగా భారత షట్లర్లు నిరాశ పరిచారు.

తొలి గేమ్​లో 16-11తో ముందున్న శ్రీకాంత్.. చెన్​ దూకుడు ముందు తలొగ్గాడు. రెండో గేమ్​లో మొదట తడబడినా తర్వాత పుంజుకుని 19-19తో స్కోరు సమం చేశాడు. అయితే చెన్​ వరుస పాయింట్లు సాధించి విజయాన్నందుకున్నాడు. చిన్న చిన్న తప్పులు చేసిన శ్రీకాంత్ ఆట గెలిచేందుకు ప్రత్యర్థికి అవకాశం కల్పించాడు.

వీరిద్దరూ ముఖాముఖి ఆరు సార్లు తలపడగా 5సార్లు చెన్​ గెలిచాడు. ఒక్కసారి మాత్రమే శ్రీకాంత్ నెగ్గాడు. 2017 ఆస్ట్రేలియన్​ ఓపెన్​ బ్యాడ్మింటన్​ ఫైనల్​లో చెన్​లాంగ్​పై చివరగా గెలిచాడు శ్రీకాంత్.

ABOUT THE AUTHOR

...view details