తెలంగాణ

telangana

ETV Bharat / sports

థాయ్​లాండ్ ఓపెన్: సైనా ఇన్- సింధు ఔట్ - thailand open

థాయ్​లాండ్ ఓపెన్​కు దూరమైంది పీవీ సింధు. ఇండోనేసియా, జపాన్ ఓపెన్​ ఆడని సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

సైనా - సింధు

By

Published : Jul 30, 2019, 1:13 PM IST

ఇండోనేసియా, జపాన్ ఓపెన్​ టోర్నీలకు దూరమైన సైనా నెహ్వాల్​ థాయ్​లాండ్ ఓపెన్​లో​ బరిలోకి దిగనుంది. పీవీ సింధు మాత్రం ఈ టోర్నీకి దూరంగా ఉండాలని నిశ్చయించుకుంది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో స్పష్టత లేదు.

ఇటీవలే ఇండోనేసియా ఓపెన్​ ఫైనల్​ వరకు వచ్చిన సింధు జపాన్ క్రీడాకారిణి యమగూచి చేతిలో పరాజయం పాలైంది. జపాన్​ ఓపెన్​లోనూ క్వార్టర్స్​లో మళ్లీ యమగూచిపైనే ఓడింది సింధు.

థాయ్​లాండ్ ఓపెన్​లో సైనా నెహ్వాల్ ఆడుతుండటం గమనార్హం. ఫిట్​నెస్​ లేని కారణంగా ఇండోనేసియా, జపాన్ ఓపెన్​కు దూరమైంది సైనా. బుధవారం మహిళల సింగిల్స్ విభాగంలో క్వాలిఫయర్​తో ఏడో సీడ్ సైనా పోటీపడనుంది.

ఇది చదవండి: 'అవతార్ టైటిల్ కామెరూన్​కు ఇచ్చింది నేనే'

ABOUT THE AUTHOR

...view details