తెలంగాణ

telangana

ETV Bharat / sports

సింగపూర్ ఓపెన్​ క్వార్టర్​ ఫైనల్లోకి  సింధు - సింగపూర్ ఓపెన్

భారత​ బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవీ సింధు.. సింగపూర్​ ఓపెన్​లో మరో మెట్టు ఎక్కింది. డెన్మార్క్​ ప్లేయర్ మియాను ఓడించి క్వార్టర్స్​లోకి వెళ్లింది.

సింగపూర్ ఓపెన్​ క్వార్టర్​ ఫైనల్లోకి  సింధు..

By

Published : Apr 11, 2019, 2:53 PM IST

సింగపూర్ ఓపెన్​లో భారత బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీ సింధు మరో ముందడుగు వేసింది. డెన్మార్క్​కు చెందిన మియా బ్లిచ్​ఫెల్ట్​ను ఓడించి క్వార్టర్స్​లోకి దూసుకెళ్లింది. తర్వాతి మ్యాచ్​లో చైనాకు చెందిన కాయ్ యన్యాన్​తో తలపడనుంది.

నాలుగో సీడ్ సింధు కేవలం 39 నిమిషాల్లోనే ఈ గేమ్​ పూర్తి చేసింది. ప్రపంచ నంబర్ 22 అయిన ప్రత్యర్థిని 21-13, 21-19 తేడాతో ఓడించింది. ఓటమి చెందిన మియా ఈ ఏడాది స్పెయిన్ మాస్టర్స్​ టైటిల్ గెలిచింది.

ఇది చదవండి: ఐపీఎల్​లో ఆపకుండా క్రికెట్ ఆడింది వీళ్లే..

ABOUT THE AUTHOR

...view details