టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన తర్వాత ఆటకు దూరంగా ఉన్న భారత షట్లర్ పీవీ సింధు మళ్లీ రాకెట్ పట్టింది. డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్లో ఘన విజయం సాధించింది. టర్కీకి చెందిన నెస్లిహాన్ యిగిట్తో తలపడిన సింధు 21-12, 21-10 తేడాతో వరుస సెట్లలో గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకుంది. సింధు స్పీడ్‌కు ప్రత్యర్థి వద్ద సమాధానం లేకపోవడం వల్ల 30 నిమిషాల్లోనే పోరు ముగిసింది.
Denmark Open: రెండో రౌండ్‌కు సింధు, శ్రీకాంత్ - డెన్మార్క్ ఓపెన్ శ్రీకాంత్
డెన్మార్క్ ఓపెన్‌లో తొలిరోజు భారత్‌కు శుభారంభం దక్కింది. మహిళల సింగిల్స్‌లో సింధు, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీ రెండో రౌండ్‌కు చేరుకుంది.
భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టి కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. ఇంగ్లాండ్‌కు చెందిన హెమ్మింగ్-స్టీవెన్ స్టాల్లోవుడ్పై 23-21, 21-15 తేడాతో గెలుపొందారు. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా.. రెండో రౌండ్లో జోరు పెంచి విజయం సాధించిందీ జోడీ.
ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ మరో భారత ఆటగాడు సాయి ప్రణీత్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో 21-14, 21-11 తేడాతో ప్రణీత్‌పై గెలిచాడు శ్రీకాంత్. మరో ఆటగాడు సమీర్ వర్మ కూడా తొలి రౌండ్లో విజయ బావుటా ఎగరవేశాడు.