భారత బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్ కోచ్ 'కిమ్ జీ హ్యూన్' తన పదవికి రాజీనామా చేశారు. పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలవడంలో ఆమె కీలకపాత్ర పోషించారు.
దక్షిణ కొరియాకు చెందిన కిమ్... వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కిమ్ రాజీనామా చేయడం వాస్తవమని... ఆమె భర్త అనారోగ్యం కారణంగా ఆమె పదవి నుంచి వైదొలిగారని బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపిచంద్ చెప్పారు.
ఒలింపిక్స్ ముందు షాక్...
ఒలింపిక్స్‌కు పది నెలల సమయమే ఉన్న సమయంలో కిమ్ రాజీనామా భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ. సింధు లాంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులకు తర్ఫీదునివ్వడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. కిమ్ స్థానంలో త్వరగా కొత్త కోచ్‌ను నియమించాల్సి ఉందని గోపిచంద్ తెలిపాడు.