ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకు.. ఎన్నో సూపర్ సిరీస్ టైటిళ్లు.. ఓ ఒలింపిక్ పతకం.. మూడుసార్లు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం.. సైనా నెహ్వాల్ ఖాతాలో ఇలా ఎన్నో ఘనతలున్నాయి. 2008లో మొదలుపెట్టి వరుసగా మూడు పర్యాయాలు ఒలింపిక్స్ ఆడింది సైనా నెహ్వాల్. 2012లో కాంస్య పతకాన్ని గెలిచింది. అలాంటి క్రీడాకారిణికి ఈసారి ఒలింపిక్ బెర్తు దక్కేలా లేదు. అలాగే ఒకే ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకునూ దక్కించుకున్న శ్రీకాంత్‌కు ఒలింపిక్ బెర్తు కష్టంగానే ఉంది.
ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో సైనా ర్యాంకు 20.. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ర్యాంకు 14. అయితే సింగిల్స్‌లో టాప్-16, డబుల్స్‌లో టాప్-8 ర్యాంకుల్లో ఉన్న క్రీడాకారులే ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌లు, సూపర్ సిరీస్‌ల్లో సత్తాచాటి తమ ర్యాంకుల్ని మెరుగుపరుచుకుని ఒలింపిక్స్ బెర్తులు సాధించాలని వీరు భావించారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ రెండు నెలల్లో జరగాల్సిన అయిదు టోర్నీలను బీడబ్ల్యూఎఫ్ వాయిదా వేసింది. అయితే ఒలింపిక్స్ అర్హతకు ఏప్రిల్ 30 నాటికి ఉండే ర్యాంకుల్నే బీడబ్ల్యూఎఫ్ పరిగణనలోకి తీసుకుంటుంది. మధ్యలో టోర్నీలేవీ జరగని పక్షంలో ర్యాంకింగ్ నిబంధనల ప్రకారం అప్పటికి సైనా స్థానం 22గా ఉంటుంది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ర్యాంకు అంతే ఉంటుందని అంచనా.
"సైనా రెండు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్, ఒకదాంట్లో సెమీస్ చేరినా.. లేదంటే రెండు టోర్నీల్లో సెమీస్‌కు అర్హత సాధించినా.. ఒలింపిక్స్‌కు వెళ్తుంది. స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్ టోర్నీల్లో ఆమె కచ్చితంగా సెమీస్‌కు వెళ్తుందని ఆశించాం. కానీ ఆ టోర్నీలు వాయిదా పడ్డాయి. వాటి భవితవ్యం ఏంటో తెలియదు. బీడబ్ల్యూఎఫ్ ఎలా క్రీడాకారుల్ని ఒలింపిక్స్‌కు ఎంపిక చేయబోతోందో అర్థం కావట్లేదు."
- పారుపల్లి కశ్యప్, భారత షట్లర్
ఎవరికి అవకాశం?