పి.వి.సింధుకు మనసు లేదని.. తాను తీవ్ర అనారోగ్యం పాలైనా పట్టించుకోలేదని భారత బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మాజీ కోచ్ కిమ్ జి హ్యూన్ ఆరోపించింది. "ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు వెళ్లేముందు తీవ్ర అనారోగ్యం పాలయ్యా. ఒక్కదాన్నే ఆసుపత్రికి వెళ్లా.. సెలైన్లు ఎక్కించుకున్నా. ఈ స్థితిలో ఎవరూ నన్ను చూడటానికి రాలేదు. సింధు ఫోన్ చేసి కోచింగ్‌కు ఎప్పుడు వస్తారని మాత్రమే అడిగింది. అప్పుడు అనిపించింది ఆమెకు హృదయం లేదని. ఆమెకు నా అవసరం కోచింగ్‌లో మాత్రమే" అని కిమ్ చెప్పింది.
సింధుకు మనసు లేదు: కిమ్ - కిమ్ హ్యూన్
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి సింధుకు మనసు లేదంటూ ఆరోపించింది మహిళల సింగిల్స్ మాజీ కోచ్ కిమ్ హ్యూన్. తనకు ఆరోగ్యం బాలేకపోయినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
PV Sindhu
ఈ ఆరోపణలపై సింధు తండ్రి పి.వి.రమణ మాట్లాడుతూ.. "కిమ్ అనారోగ్యం గురించి సింధుకు తెలియదు. ఆమె శ్రమించే అమ్మాయి కాబట్టే ఎప్పుడు కోచింగ్‌కు వస్తారని అడిగింది. కిమ్‌కు ఒంట్లో బాగోకపోతే చీఫ్ కోచ్ గోపీచంద్‌కు సమాచారం ఇవ్వాల్సింది" అని చెప్పాడు.
ఇవీ చూడండి.. రంజీలో ఆడనున్న టీమిండియా క్రికెటర్లు