గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. రంజీ ట్రోఫీలో దిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. అతడితో పాటు బౌలర్ ఇషాంత్ శర్మ కూడా దిల్లీ తరఫునే ఆడనుండటం విశేషం. దిల్లీ జట్టు డిసెంబరు 25న హైదరాబాద్‌తో తలపడనుంది.
కొంత విరామం తర్వాత బరిలోకి..
కొంతకాలంగా బీసీసీఐ నిర్వహణ పనిభారం వల్ల ఆటకు దూరంగా ఉన్న ఇషాంత్.. రంజీట్రోఫీ ద్వారా మళ్లీ మైదానంలోకి రానున్నాడు. హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఇప్పటికే వచ్చే ఏడాది న్యూజిలాండ్‌పై జరిగే టెస్ట్ సిరీస్‌లో జట్టులో చోటు సంపాదించాడు. ఇషాంత్ చివరగా బంగ్లాతో జరిగిన పింక్ టెస్టులో ఆడాడు.
మోకాలు గాయం కారణంగా విశ్రాంతి తీసుకున్న ధావన్.. గాయం నుంచి కోలుకున్నట్లు జాతీయ క్రికెట్ అకాడమి స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే శ్రీలంక, ఆస్ట్రేలియాతో సిరీస్‌ల్లో చోటు దక్కించుకున్న ధావన్.. తాజాగా రంజీ మ్యాచ్‌లోనూ ఆడనున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా ఛీఫ్ సెలెక్టర్ ప్రసాద్ తెలియజేశాడు.
ఇదీ చదవండి: ప్రపంచకప్ ఓటమి మినహా అంతా ఓకే: రోహిత్