కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సోమవారం బ్యాడ్మింటన్ రాకెట్లను బహుమతిగా అందించారు. పద్మ భూషణ్ అవార్డును ఆదివారం అందుకున్న ఆమె అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రిని కలిసి ముచ్చటించారు. ఈ విషయాన్ని రిజిజు ట్విటర్ వేదికగా వెల్లడించారు.
'పీవీ సింధు సాధించిన విజయాలకుగానూ పద్మ భూషణ్ అవార్డు దక్కడం క్రీడారంగానికి గొప్ప గౌరవం. అభినందనలు సింధు. అలాగే నాకు అత్యంత నాణ్యమైన బ్యాడ్మింటన్ రాకెట్లు బహుమతిగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అలాగే రాకెట్ హ్యాండిల్ గ్రిప్‌ను ఎలా చుట్టాలో నేర్పినందుకు ధన్యవాదాలు' అంటూ వారి సంభాషణకు సంబంధించిన వీడియోను రిజిజు ట్విటర్‌లో పోస్టు చేశారు.