తెలంగాణ

telangana

ETV Bharat / sports

చైనా ఓపెన్​: ప్రీక్వార్టర్స్​లోకి పీవీ సింధు - sai praneeth

చైనా ఓపెన్​లో స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రీక్వార్టర్స్​లోకి ప్రవేశించింది. తొలి రౌండ్​లో లీ యూరేను వరుస సెట్లలో ఓడించింది.

చైనా ఓపెన్​: క్వార్టర్స్​లోకి పీవీ సింధు

By

Published : Sep 18, 2019, 2:14 PM IST

Updated : Oct 1, 2019, 1:26 AM IST

ఇటీవలే ప్రపంచ ఛాంపియన్​షిప్​లో విజేతగా నిలిచిన భారత ప్రముఖ షట్లర్ పీవీ సింధు.. చైనా ఓపెన్​లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్​లో మాజీ నంబర్.1 క్రీడాకారిణి లీ యూరేపై 21-18, 21-12 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ప్రీక్వార్టర్స్​లోకి అడుగుపెట్టింది.

పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్​లో భారత్​కు చెందిన సాయిప్రణీత్.. థాయ్​లాండ్ షట్లర్​ సుప్పాన్యుతో హోరాహోరీగా తలపడ్డాడు. 72 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్​ను 21-19, 23-21 తేడాతో గెలుపొందాడు.

అంతకు ముందు జరిగిన మహిళల మ్యాచ్​లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్.. బుసనన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 44 నిమిషాలు జరిగిన ఈ గేమ్​ను 10-21, 17-21 తేడాతో కోల్పోయింది.

ఇది చదవండి: చైనా ఓపెన్​ నుంచి సైనా నెహ్వాల్ ఔట్

Last Updated : Oct 1, 2019, 1:26 AM IST

ABOUT THE AUTHOR

...view details