అర్జున అవార్డుకు తన పేరును సిఫార్సు చేయకపోవడం వల్ల జాతీయ సమాఖ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత షెట్లర్ హెచ్.ఎస్ ప్రణయ్... భారత బ్యాడ్మింటన్ సంఘం (బీఏఐ)ను క్షమాపణలు కోరాడు. బీఏఐ అధ్యక్షుడు హిమంత విశ్వ శర్మ.. ప్రణయ్ క్షమాపణను అంగీకరించారు. ఇటువంటి ఘటన పునరావృతం కాదని భావిస్తున్నట్లు జనరల్ సెక్రెటరీ అజయ్ సింఘానియా పేర్కొన్నారు.
మరోవైపు ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు భారత షట్లర్ హెచ్.ఎస్ ప్రణయ్ పేరును ప్రతిపాదించాలని సూచించారు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్.