తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ ఛాంపియన్​షిప్​: ప్రణీత్​కు కాంస్యమే - badmintton

ప్రపంచ ఛాంపియన్​షిప్​ సెమీస్​లో భారత షట్లర్ సాయి ప్రణీత్ ఓడిపోయాడు. జపాన్​కు చెందిన కెంటో మొమోటాపై పరాజయం చెంది కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.

ప్రణీత్

By

Published : Aug 24, 2019, 6:23 PM IST

Updated : Sep 28, 2019, 3:29 AM IST

36 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్​షిప్​లో సెమీస్ చేరిన భారతీయుడిగా రికార్డు సొంతం చేసుకున్న సాయి ప్రణీత్ ఆ ఆనందాన్ని ఎంతోసేపు నిలుపుకోలేకపోయాడు. జపాన్ క్రీడాకారుడు డిఫెండింగ్ ఛాంపియన్ కెంటో మొమోటాపై ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.

స్విట్జర్లాండ్ బాసెల్ వేదికగా జరిగిన సెమీస్​లో 13-21, 8-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం చవిచూశాడు ప్రణీత్. ప్రపంచ నెంబర్ వన్ మొమోటా కేవలం 41 నిమిషాల్లోనే మ్యాచ్​ను ముగించాడు. అయితే ఓడినప్పటికీ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుని ప్రకాశ్ పదుకుణే సరసన చేరాడు ప్రణీత్.

తొలి సెట్లో 5-3తో శుభారంభం అందుకున్న ప్రణీత్ క్రమేపీ వెనకబడిపోయాడు. స్కోరు 11-10 వద్ద ఉండగా.. మొమోటా ప్రణీత్​కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్​ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్​ ఆసాంతం ఆధిపత్యం చెలాయించి భారత షట్లర్​ను ఓడించాడు.

ఇది చదవండి: ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు పీవీ సింధు

Last Updated : Sep 28, 2019, 3:29 AM IST

ABOUT THE AUTHOR

...view details