తెలంగాణ

telangana

ETV Bharat / sports

Indonesia Open: నేటి నుంచే ఇండోనేసియా ఓపెన్​- సింధు ఈసారైనా.. - పీవీ సింధు

ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీ(Indonesia Open 2021) నేటి(నవంబర్ 23) నుంచే ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఒక్క టైటిల్‌ కూడా గెలవలేకపోయిన సింధు ఇండోనేసియా ఓపెన్‌లో ఛాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా ఉంది.

PV Sindhu
పీవీ సింధు

By

Published : Nov 23, 2021, 7:08 AM IST

Updated : Nov 23, 2021, 7:25 AM IST

ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీలో(Indonesia Open 2021) భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు(PV Sindhu News) టైటిల్‌పై కన్నేసింది. ఈ ఏడాది ఒక్క టైటిల్‌ కూడా గెలవలేకపోయిన సింధు ఇండోనేసియా ఓపెన్‌లో ఛాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా ఉంది. స్విస్‌ ఓపెన్‌లో ఫైనల్‌, డెన్మార్క్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీస్‌, ఇండోనేసియా మాస్టర్స్‌లో సెమీస్‌ చేరుకున్న సింధుకు ఈ ఏడాది బ్యాడ్మింటన్‌ టైటిల్‌ అందని ద్రాక్షలా మారింది. మంగళవారం ప్రారంభమయ్యే ఇండోనేసియా ఓపెన్‌తో (Indonesia Open 2021 Badminton) అదృష్టం మారుతుందని సింధు భావిస్తుంది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో అయా ఒహొరితో (జపాన్‌) మూడో సీడ్‌ సింధు తలపడుతుంది. తొలి రౌండ్‌, ప్రిక్వార్టర్స్‌ అధిగమిస్తే క్వార్టర్స్‌లో మిచెల్‌ లీతో (కెనడా) సింధు తలపడొచ్చు. క్వార్టర్స్‌ అడ్డంకి దాటితే సెమీస్‌లో రెండో సీడ్‌ ఇంతానన్‌ రచనోక్​తో (థాయ్‌లాండ్‌) సింధు పోటీపడొచ్చు.

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ప్రణయ్‌తో కిదాంబి శ్రీకాంత్‌, టోమా పొపోవ్​తో (ఫ్రాన్స్‌) సాయి ప్రణీత్‌, టాప్‌ సీడ్‌ కెంటొ మొమొటతో (జపాన్‌) లక్ష్యసేన్‌, కీన్‌ యూతో (సింగపూర్‌) పారుపల్లి కశ్యప్‌ అమీతుమీ తేల్చుకోనున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌ శెట్టి జోడీ ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. తొలి రౌండ్లో కొరియా జోడీ వాకోవర్‌ ఇచ్చింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో గాబ్రియెలా- స్టెఫానితో (బల్గేరియా) సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప; మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలిరౌండ్లో జోన్స్‌- లిండాతో (జర్మనీ) వెంకట ప్రసాద్‌- జుహి, యమషిత- షినోయాతో (జపాన్‌) ధ్రువ్‌- సిక్కిరెడ్డి, తకురొ- మత్సుయామతో (జపాన్‌) సుమీత్‌రెడ్డి- అశ్విని పొన్నప్ప తలపడతారు.

Last Updated : Nov 23, 2021, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details