తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సింధుకు మాతో ఎలాంటి ఇబ్బంది లేదు' - లండన్​కు సింధు

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఫ్యామిలీ టెన్షన్స్ వల్లే లండన్ వెళ్లిందని కొన్ని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయమై స్పందించారు ఆమె తండ్రి రమణ. ఆ వార్తల్లో వాస్తవం లేదంటూ కొట్టిపారేశారు.

Sindhu passage to London nothing to do with family dispute, clears father Ramana
'సింధుకు మాతో ఎలాంటి ఇబ్బంది లేదు'

By

Published : Oct 20, 2020, 12:32 PM IST

Updated : Oct 20, 2020, 1:20 PM IST

కొద్దిరోజుల క్రితం భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు లండన్​కు వెళ్లింది. ఆరోగ్యం, శిక్షణను మెరుగుపర్చుకునేందుకు అక్కడికి వెళ్లినట్లు వెల్లడించింది. అయితే దీనిపై కొన్ని మీడియాలు అనేక రకాల వార్తలు సృష్టించాయి. సింధు.. తన ఫ్యామీలీ సమస్యల వల్ల లండన్ వెళ్లిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై సింధు తండ్రి రమణ స్పందించారు. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. దీనిపై ఈటీవీ భారత్​తో మాట్లాడిన ఆయన పలు విషయాలు వెల్లడించారు.

"ఆ వార్తలు పసలేనివి. సింధు తన ఆరోగ్యం, శిక్షణను మెరుగుపర్చుకునేందుకు లండన్​లోని గటొరేడ్ స్పోర్ట్స్ సైన్స్ ఇనిస్టిట్యూట్ వెళ్లింది. కానీ కొందరు అసత్య వార్తలు సృష్టిస్తున్నారు."

-రమణ, సింధు తండ్రి

ఇదే విషయపై సింధు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించింది. తనకు ఫ్యామిలీ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేసింది.

"నా న్యూట్రిషన్​, శిక్షణ కోసం లండన్​కు కొద్దిరోజుల క్రితం వచ్చా. నేను ఫ్యామిలీకి చెప్పే ఇక్కడకు వచ్చా. ఈ విషయంలో నాకు కుటుంబంతో ఎలాంటి గొడవలు లేవు. అలాగే కోచ్ గోపీచంద్, అకాడమీతోనూ ఎలాంటి ఇబ్బందులు లేవు."

-సింధు, బ్యాడ్మింటన్ ప్లేయర్

మాజీ ప్రపంచ ఛాంపియన్ సింధు డెన్మార్క్ ఓపెన్ నుంచి తప్పుకుంది. జనవరిలో జరిగే ఆసియా కప్​ ద్వారా మళ్లీ కోర్టులో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Last Updated : Oct 20, 2020, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details