ఇటీవల బ్యాడ్మింటన్ టోర్నీల్లో వరుసగా విఫలమైన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. స్విస్ ఓపెన్‌లో తిరిగి గాడిలో పడింది. ఫైనల్లో మారిన్ చేతిలో ఓడినప్పటికీ.. ఫామ్‌లోకి రావడం ఆనందంగా ఉందని తెలిపింది. థాయ్‌లాండ్ ఓపెన్ తప్పిదాలు, ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్స్‌కు సన్నద్ధత, కొవిడ్ కాలంలో తీసుకున్న శిక్షణ, టోక్యో ఒలింపిక్స్‌కు ముందు గచ్చిబౌలి స్టేడియంలో సాధన.. వంటి వివిధ అంశాలపై ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడింది.
1. స్విస్ ఓపెన్‌లో మీ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నారా?
స్విస్ ఓపెన్ ఫైనల్ వరకు వెళ్లడం ఆనందంగా ఉంది. అయితే అదే సమయంలో మ్యాచ్ ఫలితం పట్ల సంతోషంగా లేను. ఆ మ్యాచ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను అనుకున్న వ్యూహం పనిచేయలేదు. అది తప్పుడు వ్యూహం అయి ఉండొచ్చు. స్విస్ ఓపెన్ అనంతరం ఆట పట్ల బలంగా తయారయ్యాను.
2. గత టోర్నీల్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. ఈసారి అలా జరగలేదు. టెక్నికల్ అంశాలలో ఏమైనా మార్పులు చేశారా?
థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి వచ్చాక నా తప్పులేంటో తెలుసుకున్నాను. వాటిని సరిదిద్దుకోవడం నాకు ముఖ్యం. ఇది చాలా అవసరం. ఫైనల్స్‌కు చేరుకోవడం అంటేనే గొప్ప. ఈ విషయం నాకు థాయ్‌లాండ్ ఓపెన్‌లో తెలిసొచ్చింది. టెక్నిక్, వ్యూహం, ఇంకేదైనా.. నేను ప్రతి దానిపై పని చేస్తాను. నా తప్పులను సరిదిద్దుకున్నాను. వాటి నుంచి అంతే బలంగా తిరిగొచ్చాను. గెలిచామా లేదా అన్నది పక్కనపెడితే స్విస్ ఓపెన్ నాకు చాలా ముఖ్యమైనది.
3. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్.. మీ ఆటపై ఏ మేరకు ప్రభావం చూపింది?
కొవిడ్ సమయంలో నేను ఇంటి దగ్గర సాధన చేశాను. దీంతో నాకంతా బాగానే అనిపించింది. లాక్డౌన్ తర్వాత తిరిగి గాడిలోకి రావడానికి నాక్కొంచెం సమయం పట్టింది. ఏదేమైనా మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉంది.
4. కరోలినా మారిన్‌పై మీ స్పందన ఏంటి? ఆమె కోర్టులో వేగంగా కదులుతుంది. స్మాష్‌లు, డ్రాప్‌లు సరిగా ఆడుతోంది.