సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) బయోపిక్‌ను కూడా ఈ క్రమంలోనే తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె(Deepika Padukone) నటిస్తుంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేసేలా దీపిక తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. రాకెట్ పట్టి కోర్టులోకి దిగిన దీపికా.. సింధూతో హోరాహోరీగా తలపడినట్లు కనిపించింది. వీటిని చూసిన అభిమానులు సింధు బయోపిక్‌లో దీపిక లీడ్రోల్లో చేస్తుందా అని చర్చించుకుంటున్నారు.
PV Sindhu: పీవీ సింధు బయోపిక్.. స్టార్ హీరోయిన్‌కు ఛాన్స్! - సింధుతో దీపికా పదుకునె
వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లోనూ పతకాలు గెల్చిన పీవీ సింధు (PV Sindhu)పై త్వరలో బయోపిక్ వచ్చేలా కనిపిస్తోంది. ఇందులో బాలీవుడ్‌కు చెందిన స్టార్ టైటిల్ రోల్ చేయనున్నట్లు సమాచారం. ఇంతకీ ఎవరా భామ? ఎందుకీ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది?
పీవీ సింధు బయోపిక్
ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసిన దీపిక రోజు వారి వ్యాయామంలో భాగంగా సింధుతో గేమ్ ఆడినట్లు చెప్పుకొచ్చింది. కానీ బయోపిక్ సంబంధించి వీరు కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుటికే సింధు ఓ సారి దీపికా, రణ్వీర్ కపూర్ జంటనుకలిసింది. అందులోనూ దీపిక తండ్రి ప్రకాశ్ పదుకొణె కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది.
ఇదీ చూడండి:Virat Kohli Captaincy: కోహ్లీ.. వన్డేల్లోనూ కెప్టెన్‌గా తప్పుకోవాలన్న శాస్త్రి!