తెలంగాణ

telangana

ETV Bharat / sports

నో ఛేంజ్​: బ్యాడ్మింటన్​లో ఇకపైనా 3 గేమ్​ల విధానమే

బ్యాడ్మింటన్​​లో ఇకపై మూడు గేమ్​ల విధానమే కొనసాగనుంది. కొత్త విధానాన్ని అమలు చేయడానికి నిర్వహించిన ఓటింగ్​లో కొద్ది తేడాతో మెజారిటీ కోల్పోయింది.

BWF, Badminton's scoring system
బీడబ్ల్యూఎఫ్, బ్యాడ్మింటన్​లో మూడు గేమ్​ల స్కోరింగ్ విధానం

By

Published : May 22, 2021, 9:44 PM IST

బ్యాడ్మింటన్​లో ప్రస్తుతమున్న మూడు గేమ్ (21x3)​ల స్కోరింగ్ విధానాన్నే కొనసాగించనున్నారు. ఐదు గేమ్​ (11x5)ల కొత్త విధానాన్ని ప్రతిపాదిస్తూ నిర్వహించిన ఓటింగ్​లో మూడింట రెండు వంతుల మెజారిటీ రాలేదు.

ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఓటింగ్​ను నిర్వహించారు. మొత్తం 282 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 66.31 శాతం ఓట్లు ఐదు గేమ్​ల విధానాన్ని ప్రతిపాదించిన అసోసియేషన్లకు వచ్చాయి. ఇందుకు వ్యతిరేకంగా 33.69 శాతం ఓట్లు ప్రస్తుత విధానానికి అనుకూలంగా ఉన్న అసోసియేషన్లకు పోలయ్యాయి. కొద్ది తేడాతో కొత్త విధానాన్ని అమలు చేసే అవకాశం దూరమైంది.

ఈ ఓటింగ్​లో పాల్గొన్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య అధ్యక్షుడు పౌల్​ ఎరిక్ హోయర్. ఇండోనేసియా, కొరియా బ్యాడ్మింటన్​ అసోసియేషన్లు కొత్త విధానాన్ని ప్రతిపాదించగా.. బ్యాడ్మింటన్ ఆసియా, కొరియా, తైపీ బ్యాడ్మింటన్​ అసోసియేషన్లు మద్దతు ప్రకటించాయి.

ఇదీ చదవండి:బ్యాడ్మింటన్ గేమ్‌లు మూడా.. ఐదా?

ABOUT THE AUTHOR

...view details