భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి ఎన్.సిక్కిరెడ్డికి కరోనా సోకింది. ఆమెతో పాటు ఫిజియో సి.కిరణ్‌కు గురువారం వచ్చిన వైద్య పరీక్షల ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. కొవిడ్-19 కారణంగా దాదాపు మూడున్నర నెలల విరామం తర్వాత ఆగస్టు 7న జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో జాతీయ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఇందులో సిక్కి సహా పలువురు స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు సాధన ఆరంభించారు.
బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డికి కరోనా పాజిటివ్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎన్.సిక్కిరెడ్డికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఆమెతో పాటు ఫిజియో కిరణ్ వైరస్ బారిన పడ్డారు. ఫలితంగా శానిటైజేషన్ కోసం పుల్లెల గోపీచంద్ అకాడమీని తాత్కాలికంగా మూసివేశారు.
బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డికి కరోనా పాజిటివ్
పీవీ సింధు సహా మొత్తం 18 మందికి భారత క్రీడాప్రాధికార సంస్థ(శాయ్) మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో ఈ ఇద్దరికీ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఫలితంగా శుక్రవారం నుంచి ఆటగాళ్ల ట్రైనింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.