తెలంగాణ

telangana

ETV Bharat / sports

54 ఏళ్ల 'ఆసియా టైటిల్​' కల నెరవేరేనా..! - భారత స్టార్​ షట్లర్లు

భారత స్టార్​ షట్లర్లు సైనా నెహ్వాల్​, పీవీ సింధు కీలక పోరుకు సిద్ధమయ్యారు. 54 ఏళ్లుగా ఎదురుచూస్తోన్న ఆసియా ఛాంపియన్​షిప్​ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు.

54 ఏళ్ల 'ఆసియా టైటిల్​' కల నెరవేరేనా..!

By

Published : Apr 24, 2019, 8:52 AM IST

వారం విశ్రాంతి తర్వాత మళ్లీ బరిలోకి దిగుతున్నారు సైనా, పీవీ సింధు. 54 ఏళ్లుగా ఊరిస్తున్న ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలవాలని పట్టుదలతో ఉన్నారు. దీన్ని సాకారం చేసేందుకు నేటి నుంచి జరిగే మెయిన్ డ్రా మ్యాచ్​ల్లో ప్రపంచస్థాయి ప్రత్యర్థులతో తలపడనున్నారు.

  • ఖన్నా తర్వాత ఒక్కరూ లేరు...

1965లో భారత క్రీడాకారుడు దినేశ్ ఖన్నా... పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచిన తర్వాత ఇప్పటివరకు ఏ షట్లరు స్వర్ణం గెలవలేదు.
ఈ టోర్నీలో 2010, 2016లో సైనా, 2014లో సింధు కాంస్య పతకాలే సాధించారు. మహిళల సింగిల్స్ తొలిరౌండ్‌లో నాలుగో సీడ్ సింధు.. సయాక తకహాషి (జపాన్)తో పోటీపడనుంది. ఏడోసీడ్ సైనా.. హన్ యూ (చైనా)తో పోరుకు సిద్ధమైంది.

టైటిల్​తో దినేశ్​ ఖన్నా

పురుషుల సింగిల్స్​...

పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో హిరెన్ రుస్తవితో (ఇండోనేసియా)తో కిదాంబి శ్రీకాంత్ పోటీకి సిద్ధమయ్యాడు. కాజుమా సకాయ్ (జపాన్)తో సమీర్ వర్మ తలపడనున్నాడు.

డబుల్స్​..

మహిళల డబుల్స్‌లో తెలుగమ్మాయి జక్కంపూడి మేఘన అదృష్టం పరీక్షించుకోనుంది.

మిక్సెడ్​ నిరాశ..

మంగళవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో రోహన్ కపూర్-కుహూ గార్గ్ జంట 5-21, 15-21తో ప్రవీణ్ -మెలాటి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓటమిపాలైంది., సౌరభ్ శర్మ- పారిఖ్ జోడీ 9-21, 9-21తో డెచపోల్-సాప్‌సిరీ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చెందారు.

ABOUT THE AUTHOR

...view details