తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​​పై కర్మాకర్ గురి

రేపటి నుంచి బకులో జరిగే జిమ్నాస్టిక్​ ప్రపంచకప్​కు సిద్ధమైంది దీపా కర్మాకర్. ఇందులో సత్తా చాటి ఒలింపిక్స్​ బెర్త్ ఖాయం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే జర్మనీలో జరిగిన పోటీల్లో కాంస్యం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతుందీ క్రీడాకారిణి.

By

Published : Mar 13, 2019, 6:10 PM IST

దీపా కర్మాకర్

భారత జిమ్నాస్టిక్ క్రీడాకారిణి దీపా కర్మాకర్ ఒలింపిక్స్ బెర్త్​పై కన్నేసింది. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ పోటీల్లో మంచి ప్రదర్శనలతో ఆకట్టుకున్న దీప... టోక్యో క్రీడలపై గురిపెట్టింది. గతేడాది నవంబరులో జర్మనీలో జరిగిన ఆర్టిస్టిక్ జిమ్మాస్టిక్ ప్రపంచకప్​లో కాంస్యం సాధించి ఒలింపిక్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

గత ఏడాది జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో మోకాలి గాయంతో ఆటకు దూరమైంది దీప. తర్వాత పుంజుకుని జర్మనీ ప్రపంచకప్​లో సత్తా చాటింది. ఫిబ్రవరిలో మెల్​బోర్న్ ప్రపంచకప్​ సీజన్​లో పాల్గొనకపోయినా.. బకు(అజార్​బైజాన్), దోహ(ఖతర్)లో జరిగే వరల్డ్ కప్ టోర్నీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది.

"ప్రపంచకప్​ పోటీల్లో సత్తా చాటి 2020 ఒలింపిక్స్​ అర్హత అవకాశాలను మెరుగుపరచుకుంటాను. గత ఏడాది జర్మనీలో కాంస్యం గెలవడంతో నాలో ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగింది"
--దీపాకర్మాకర్, భారత జిమ్నాస్టిక్ క్రీడాకారిణి

బకులో ఈ నెల 14 నుంచి 17 వరకు జిమ్నాస్టిక్ ప్రపంచకప్​ జరగనుంది. దోహలో ఈ నెల 20 నుంచి 23 వరకు టోర్నీ నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది వివిధ చోట్ల జిమ్నాస్టిక్​ ప్రపంచకప్​ నిర్వహిస్తుంది అంతర్జాతీయ జిమ్నాస్టిక్ ఫెడరేషన్(ఎఫ్​ఐజీ). ఈ పోటీల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారిని ఒలింపిక్స్​లోని 8 రౌండ్ల అర్హత పోటీలకు ఎంపిక చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details