'జబర్దస్త్' చూసే చాలామందికి ఇమ్మాన్యుయేల్- వర్ష గురించి తెలిసే ఉంటుంది! వీరిద్దరి మధ్య సాగిన లవ్‌ట్రాక్ అలరిస్తూ, ఎప్పటికప్పుడు మెప్పిస్తూ వచ్చింది. అయితే వర్ష మోసం చేయడం వల్ల ఇమ్యాన్యుయేల్ ప్రొడక్షన్ బాయ్‌గా మారిపోయాడు. ఇదంతా నిజం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే హైపర్ ఆది స్కిట్లో భాగంగా ఇదంతా జరిగింది.
ఆద్యంతం ఆకట్టుకున్న ఈ స్కిట్లో హైపర్ ఆది.. 'జబర్దస్త్' డైరెక్టర్‌గా నటించాడు. మూడు జోడీలను పిలిచారు. అందులో వర్ష-ఇమ్యాన్యుయేల్ పాత్రల్ని రీతూచౌదరి- అజహర్ పోషించి, తెగ నవ్వించారు.