'తాండవ్' వెబ్ సిరీస్‌లో హిందు దేవుళ్లను కించపరిచేలా కొన్ని సీన్లు, డైలాగ్‌లు ఉన్నాయని హజ్రత్‌గంజ్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సిరీస్ దర్శక నిర్మాతలతో పాటు అమెజాన్ ఇండియా హెడ్ అపర్ణ పురోహిత్‌పై కేసు పెట్టాడు. ఈ విషయాన్ని సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ అమర్నాథ్ యాదవ్ వెల్లడించారు.
జనవరి 15న విడుదలైన సిరీస్‌లోని తొలి ఎపిసోడ్ 17వ నిమిషంలో హిందు దేవతలను కించపరిచేలా చూపించారంటూ, డైలాగ్ల్లోని భాష సరిగా లేవని సదరు వ్యక్తి ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇవి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పాడు.
కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు, 'తాండవ్' సిరీస్‌పై నిషేధం గురించి తాను లేఖ కూడా రాశానని భాజపా ఎంపీ మనోజ్ కోటక్ ఆదివారం చెప్పారు. ఈ విషయమై స్పందించిన సదరు శాఖ.. వివాదంపై అమెజాన్ వీడియో ఇండియాను వివరణ కోరినట్లు తెలుస్తోంది.