'యమలీల' సినిమా(yamaleela songs) ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ చిత్రం 27వ వార్సికోత్సవ సంబరాలు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో(sridevi drama company latest promo) జరిగాయి. ఈ ఎపిసోడ్‌కు ముఖ్యఅతిథిగా దర్శకుడు కృష్ణారెడ్డి, అలీ వచ్చి తెగ సందడి చేశారు.
సుడిగాలి సుధీర్(sudigali sudheer age) సరిగ్గా రెండు గంటల్లో నరకానికి పోతాడని భవిష్యవాణిలో ఉంది. దీంతో యముడిని(గెటప్ శీను) ఇంప్రెస్ చేసి ప్రాణాలు దక్కించుకోవడం అనే కాన్సెప్ట్‌తో ఈ ఎపిసోడ్ రూపొందించారు.
అలీకి డ్యాన్స్ ట్రిబ్యూట్ ఇస్తూ 'ఎర్రా కలువ పువ్వా యేద్దామా చలి మంట' పాటకు హైపర్ ఆది, విష్ణుప్రియ.. 'వస్తావా జానకి వంగతోటకి' గీతానికి రాము, తేజస్విని.. 'నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మో' పాటకు రామ్‌ప్రసాద్, విష్ణుప్రియ చిందులు వేసి అలరించారు.
అలానే 'యమలీల' చిత్రం వెనకున్న కథను నరేశ్, బాబు తదితరులు స్కిట్ చేసి చూపించి, ఆకట్టుకున్నారు. 'చినుకు చినుకు అందెలతో' పాటకు అలీ, ఇంద్రజ డ్యాన్స్ చేసి అప్పటిరోజుల్ని మరోసారి గుర్తుచేశారు. ప్రోమో చూస్తున్నంతసేపు ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ చూద్దామా అనే ఆత్రుత కలిగించింది.
ఇవీ చదవండి: